Share News

Indian drinks : వేసవి తాపాన్ని తగ్గించే పానీయాలతో సమ్మర్లో చిల్ అవ్వండి..!

ABN , Publish Date - Apr 03 , 2024 | 11:07 AM

వేసవి కాలం వచ్చిందంటో చల్లగా ఏదైనా తాగాలనుకునే వారికోసం ప్రత్యేకంగా భారతదేశంలోనే ఫేమస్ అయిన డ్రింక్స్ బోలెడున్నాయి. వీటిని తీసుకోవడం వల్ల శరీరం చల్లగా ఉండటమే కాకుండా, వేడి నుంచి ఉపశమనాన్ని ఇస్తాయి

Indian drinks : వేసవి తాపాన్ని తగ్గించే పానీయాలతో సమ్మర్లో చిల్ అవ్వండి..!
hair growth

వేసవి కాలం వచ్చిందంటో చల్లగా ఏదైనా తాగాలనుకునే వారికోసం ప్రత్యేకంగా భారతదేశంలోనే ఫేమస్ అయిన డ్రింక్స్ బోలెడున్నాయి. వీటిని తీసుకోవడం వల్ల శరీరం చల్లగా ఉండటమే కాకుండా, వేడి నుంచి ఉపశమనాన్ని ఇస్తాయి. మనకు తెలిసిన మన డ్రింక్స్ ఎన్ని ఉన్నాయంటే..

మ్యాంగో లస్సీ

మామిడి అనేది వివిధ రకాల తీపి వంటలలో రసాలలో ఉపయోగించే ఒక ప్రసిద్ధ పదార్ధం. ఈ డ్రింక్ వేసవిలో మామిడి కాలంలో తప్పక తాగుతారు. అయితే, ఈ సాంప్రదాయ భారతీయ పానీయం, మామిడి లస్సీలో తీపి పెరుగు, పాలు, మామిడి, పంచదార, కొన్ని ఏలకులు కలిపి తయారు చేస్తారు.

అస్సాం టీ

ఈ టీని ఇష్టపడే వారు , చాలా ఫేమస్.. దీనిని ఇష్టపడనివారంటూ ఉండరు. ఈ టీలో ఉపయోగించే సువాసనగల ఆకులు అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటాయి, రోగనిరోధక శక్తిని పెంచుతాయి. గుండె, మెదడు ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తాయి.

సోల్ కాధీ

మిల్క్‌షేక్‌ ఇది కొబ్బరి పాలు, కరివేపాకు, ఇతర మసాలా దినుసుల మిశ్రమం. జీర్ణవ్యవస్థను జాగ్రత్తగా చూసుకోవడానికి శరీరం చాలా చల్లగా ఉండేందుకు సహకరిస్తుంది.

మసాలా చాయ్

ఈ భారతీయ పానీయాలలో అత్యంత జనాదరణ పొందిన మసాలా చాయ్. ఆకులు, సుగంధ ద్రవ్యాల మిశ్రమం క్లాసిక్ డ్రింక్.

ఇంట్లో బీరువా ఎక్కడ పెట్టుకోవాలి.. ఇలా చేస్తే డబ్బుకు లోటుండదట..?

నమ్కీన్ లస్సీ

నాలుగు పదార్థాలు. నామ్‌కీన్ లస్సీని తయారు చేయడానికి ఇది సరిపోతుంది. పెరుగు, నీరు, ఉప్పు, వేయించిన జీలకర్ర పొడిని కలుపుతారు.

తాండై

అదే విధంగా రిఫ్రెష్‌గా ఉండే ప్రత్యామ్నాయ తీపి పానీయం. ఇది బాదం, సోపు గింజలు, పుచ్చకాయ గింజలు, గులాబీ రేకులు, మిరియాలు, గసగసాలు, యాలకులు, కుంకుమపువ్వు, పాలు, పంచదార మిశ్రమంతో తయారుచేయబడింది.

రాగి పాత్రలో నీటిని తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటంటే..!

ఆమ్ పన్నా..

భారతదేశంలో వేసవికి ఆమ్ పన్నా చక్కని పానీయం. ఇది వేసవిలో ఉల్లాసంగా, రిఫ్రెష్‌గా ఉంటుంది.

ఐస్డ్ జల్డీరా..

ఈ డ్రింక్ ఉత్తర భారతదేశంలో ప్రసిద్ధి చెందినది. మసాలా దినుసులు, కొత్తిమీర, నిమ్మకాయతో కలిపి చేసే వేసవి డ్రింక్ ఇది.

మసాలా చాస్..

ఈ డ్రింక్ సాంప్రదాయ పానీయం, రుచిలో ఉప్పగా ఉంటుంది. కానీ మండుతున్న వేసవిలో ఇంధనం నింపడానికి చక్కని ఛాయిస్..

సత్తు షర్భత్..

ఈ పానీయం భారతదేశంలోని బీహార్ కు చెందినది. ఇది ఫిల్లింగ్, హెల్తీ డ్రింక్..


ఇవి కూడా చదంవండి:

వేసవి చర్మ సంరక్షణ కోసం తీసుకోవాల్సిన చిట్కాలు..!!

పదునైన కంటి చూపుకోసం 8 సూపుర్ ఫుడ్స్ ఏవంటే..!

కిచెన్ గార్డెన్‌లో పెంచుకునే మొక్కలేంటో తెలుసా..!

ప్రపంచంలో అతి చిన్న జీవులు ఇవే..

వేసవిలో ఆకుకూరలు తినడం వల్ల..

షికంజీ..

ఈ ఫీజీ డ్రింక్ నిమ్మకాయ, సుగంధ ద్రవ్యాలతో, పుదీనా ఆకులతో తయారు చేస్తారు. మంచి రుచితోపాటు, వేసవి తాపాన్ని కూడా తగ్గిస్తుంది.

కొబ్బరినీరు..

వేసవిలో కొబ్బరి నీరు రిఫ్రెష్ గా, హైడ్రేటెడ్‌గా ఉంచుతుంది.

నిమ్మకాయ నీరు..

నిమ్మకాయ, చక్కెర, నీటితో తయారు చేసే ఈ డ్రింక్ వేసవి తాపాన్ని తగ్గిస్తుంది. కడుపు చల్లగా ఉండేలా చేస్తుంది. వేసవిలో చాలా ఎక్కువమంది తాగే పానీయం ఇది.

లస్సీ..

పంజాబ్ లో పుట్టిన లస్సీ ఇప్పుడు పాన్ ఇండియా డ్రింక్ గా మారింది. ఇది రిఫ్రెష్ గా ఉంచుతుంది.

మరిన్ని వార్తల కోసం లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Apr 03 , 2024 | 11:07 AM