Share News

Technology : మూడేళ్ళలో యువతకు చేరువ

ABN , Publish Date - Jun 08 , 2024 | 06:03 AM

ఫేస్‌బుక్‌ అనతికాలంలోనే అంటే ఆరంభించిన ఇరవై సంవత్సరాల్లోనే అన్ని వర్గాల ఆదరణ పొందింది. మరీ ముఖ్యంగా గడచిన మూడేళ్ళలో యువతకు మరింత చేరువైంది. ఈ విషయాన్ని ఫేస్‌బుక్‌ స్వయంగా ప్రకటించింది. అమెరికా, కెనడాలోనే 18-29 మధ్యవయస్కులైన నాలుగుకోట్ల మంది యువత రోజూ ఫేస్‌బుక్‌ని ఉపయోగిస్తున్నారు.

Technology : మూడేళ్ళలో యువతకు చేరువ

ఫేస్‌బుక్‌ అనతికాలంలోనే అంటే ఆరంభించిన ఇరవై సంవత్సరాల్లోనే అన్ని వర్గాల ఆదరణ పొందింది. మరీ ముఖ్యంగా గడచిన మూడేళ్ళలో యువతకు మరింత చేరువైంది. ఈ విషయాన్ని ఫేస్‌బుక్‌ స్వయంగా ప్రకటించింది. అమెరికా, కెనడాలోనే 18-29 మధ్యవయస్కులైన నాలుగుకోట్ల మంది యువత రోజూ ఫేస్‌బుక్‌ని ఉపయోగిస్తున్నారు. గడచిన అయిదు క్వార్టర్లలో ఆరోగ్యకరమైన అభివృద్ధి సాధించామని మెటా ప్రకటించింది.

మొదటిసారి ఇలాంటి వివరాలతో డెమోగ్రాఫిక్‌ సమాచారాన్ని మెటా విడుదల చేసింది. టిక్‌టాక్‌ వైపు మరలిన యువతను ఆకట్టుకునేందుకు ఈ మూడేళ్ళూ కృషి చేసింది. ఆ ప్రయత్నాలు ఫలించాయి. యువత చేరిన కొత్తలో మార్కెట్స్‌, గ్రూప్స్‌, డేటింగ్‌పైనే దృష్టి పెడతారు. తమ జీవితానికే ప్రాధాన్యం ఇస్తారని తెలిపింది. నిజానికి ఆరంభించిన మూడేళ్ళలోనే అయిదు కోట్ల మందిని ఆకట్టుకున్న ఘనత ఫేస్‌బుక్‌కు ఉంది. గత ఏడాది ‘ప్యూ గ్రూప్‌’ నిర్వహించిన సర్వే ప్రకారం అమెరికా యువతలో మూడో వంతుమంది ఫేస్‌బుక్‌ ఉపయోగిస్తున్నారు.

Updated Date - Jun 08 , 2024 | 06:03 AM