Share News

Delhi: ఢిల్లీలో రైతుల నిరసనలెందుకు.. వారి డిమాండ్లేంటి

ABN , Publish Date - Feb 12 , 2024 | 01:30 PM

డిమాండ్లు నెరవేర్చాలని కోరుతూ దేశ రాజధాని ఢిల్లీని రైతులు, రైతు సంఘాలు చుట్టుముడుతున్నాయి. పంటలకు కనీస మద్దతు ధర(MSP) హామీకి చట్టం తీసుకురావడంతో సహా పలు డిమాండ్లు నెరవేర్చాలని మంగళవారం 200లకుపైగా రైతు సంఘాలు ఢిల్లీకి పాదయాత్ర చేయనున్నాయి.

Delhi: ఢిల్లీలో రైతుల నిరసనలెందుకు.. వారి డిమాండ్లేంటి

ఢిల్లీ: డిమాండ్లు నెరవేర్చాలని కోరుతూ దేశ రాజధాని ఢిల్లీని రైతులు, రైతు సంఘాలు చుట్టుముడుతున్నాయి. పంటలకు కనీస మద్దతు ధర(MSP) హామీకి చట్టం తీసుకురావడంతో సహా పలు డిమాండ్లు నెరవేర్చాలని మంగళవారం 200లకుపైగా రైతు సంఘాలు ఢిల్లీకి పాదయాత్ర చేయనున్నాయి. దీంతో రాజధాని చుట్టు పక్కల రహదారులను పోలీసులు దిగ్భంధించారు.

బారికేడ్లు, జేసీబీలను మోహరించారు. దాదాపు 20 వేల మంది హరియాణా, పంజాబ్ రైతులు ట్రాక్టర్లతో ఢిల్లీలోకి ప్రవేశించే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. రైతుల నిరసనలు అడ్డుకునేందుకు సింఘు, ఘాజీపూర్, టిక్రీ సరిహద్దులో భద్రతను కట్టుదిట్టం చేశారు. మార్చి 12 వరకు పెద్ద సమావేశాలు నిర్వహించకుండా నిషేధం విధించారు.

అంబాలా, జింద్, ఫతేహాబాద్ జిల్లాల్లో పంజాబ్-హరియాణా సరిహద్దులను మూసేస్తున్నారు. అంబాలా, కురుక్షేత్ర, కైతాల్, జింద్, హిసార్, ఫతేహాబాద్, సిర్సా జిల్లాల్లో ఇంటర్నెట్ సేవలను నిలిపివేయాలని హరియాణా ప్రభుత్వం ఆదేశించింది.


రైతుల డిమాండ్లివి..

  • కనీస మద్దతు ధరను చట్టం చేయాలి.

  • స్వామినాథన్ కమిషన్ సిఫార్సులను అమలు చేయాలి.

  • రైతులు, రైతు కూలీలకు పెన్షన్‌లివ్వాలి.

  • వ్యవసాయ రుణమాఫీ చేయాలి.

  • కర్షకులపై పెట్టిన పోలీసు కేసులను ఉపసంహరించుకోవాలి.

  • లఖింపూర్ ఖేరీ హింసాకాండ బాధితులకు న్యాయం చేయాలి.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Feb 12 , 2024 | 01:30 PM