Share News

Shashi Tharoor: ప్రధాని మోదీకి ప్రత్యామ్నాయం ఎవరు? శశి థరూర్ క్రేజీ అన్సార్

ABN , Publish Date - Apr 03 , 2024 | 12:32 PM

దేశంలో లోక్‌సభ ఎన్నికల(lok sabha elections 2024) హాడావిడి మొదలైంది. ఏప్రిల్ 19న మొదటి దశ పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ప్రధాన పార్టీల అభ్యర్థులు ప్రచారం ప్రారంభించారు. ఈ క్రమంలోనే కేరళ నుంచి మూడుసార్లు ఎంపీగా గెలిచిన తిరువనంతపురం(thiruvananthapuram) కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్‌(Shashi Tharoor)కు తన ప్రచారంలో భాగంగా మీడియా నుంచి ఆసక్తికర ప్రశ్న ఎదురైంది.

Shashi Tharoor: ప్రధాని మోదీకి ప్రత్యామ్నాయం ఎవరు? శశి థరూర్ క్రేజీ అన్సార్

దేశంలో లోక్‌సభ ఎన్నికల(lok sabha elections 2024) హాడావిడి మొదలైంది. ఏప్రిల్ 19న మొదటి దశ పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ప్రధాన పార్టీల అభ్యర్థులు ప్రచారం ప్రారంభించారు. ఈ క్రమంలోనే కేరళ నుంచి మూడుసార్లు ఎంపీగా గెలిచిన తిరువనంతపురం(thiruvananthapuram) కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్‌(Shashi Tharoor)కు తన ప్రచారంలో భాగంగా మీడియా నుంచి ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. మరోసారి ఓ జర్నలిస్ట్ ప్రధాని మోదీ(narendra Modi)కి ప్రత్యామ్నాయం ఎవరని అడిగారని శశి థరూర్ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ X వేదిగా వెల్లడించారు. అంతేకాదు దీనికి సమాధానం కూడా తనదైన శైలిలో చెప్పారు. పార్లమెంటరీ వ్యవస్థలో ప్రధాని నరేంద్ర మోదీ స్థానంలో ఎవరు ఉండాలనే ప్రశ్న అసంబద్ధమైనదని అన్నారు. అధ్యక్ష వ్యవస్థలో మాదిరిగా మనం ఎన్నుకోవడం లేదన్నారు. మేము ఏ ఒక్కరినీ ఎన్నుకోవడం లేదని, పార్టీని లేదా పార్టీల కూటమిని ఎన్నుకుంటామని ఆయన చెప్పారు.


ఈ క్రమంలో ప్రధానమంత్రికి (prime minister) పోటీ ఎవరంటే అనుభవజ్ఞుడైన, సమర్థుడైన ప్రజల సమస్యలపై స్పందించే అహంభావం లేని నాయకులేనని చెప్పారు. ఆ క్రమంలో ప్రధానిగా ఎవరిని ఎంచుకుంటామనేది తర్వాత విషయమని వెల్లడించారు. ఈ నేపథ్యంలో మన ప్రజాస్వామ్యాన్ని, భిన్నత్వాన్ని పరిరక్షించడమే తమ మొదటి ప్రాధాన్యత అని శశిథరూర్‌ వెల్లడించారు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో అసలు ఇండియా కూటమిలో ఎవరు ప్రధానమంత్రి అభ్యర్థి అనేది చర్చనీయాంశంగా మారింది.


ఇక కేరళ(kerala)లోని తిరువనంతపురం నుంచి శశిథరూర్‌(Shashi Tharoor) మూడుసార్లు ఎంపీగా గెలిచి, నాలుగోసారి ఇప్పుడు లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఈ స్థానం నుంచి ఆయనకు పోటీగా బీజేపీ(BJP) అభ్యర్థి రాజీవ్ చంద్రశేఖర్, లెఫ్ట్ ఫ్రంట్ అభ్యర్థి పన్నయన్ రవీంద్రన్‌లు బరిలోకి దిగుతున్నారు. తిరువనంతపురంలో ఏప్రిల్ 26న రెండో విడత పోలింగ్ జరగనుంది. దేశవ్యాప్తంగా ఏడు దశల్లో లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. ఏప్రిల్ 19 నుంచి ఓటింగ్ ప్రారంభం కానుంది.


ఇది కూడా చదవండి:

Kejriwal : ఒక్కసారిగా 4.5 కిలోల బరువు తగ్గిన కేజ్రీవాల్.. టెన్షన్‌లో ఆప్!

IRCTC: 8 రోజులు, 7 రాత్రుల స్పెషల్ టూర్ ప్యాకేజీ.. శ్రీకృష్ణుడి ద్వారకా నగరం సహా ఇవి కూడా

మరిన్ని జాతీయ వార్తల కోసం


Updated Date - Apr 03 , 2024 | 01:18 PM