Share News

Delhi: ప్రియురాలికి గిఫ్ట్‌గా రూ.100కోట్ల బిల్డింగ్.. పోలీసుల దర్యాప్తులో విస్తుగొల్పే నిజాలు

ABN , Publish Date - Jan 06 , 2024 | 01:59 PM

ఏ ప్రియుడైనా ప్రియురాలికి గిఫ్ట్ గా ఏమిస్తాడు. ప్రత్యేక సందర్భాలుంటే చాక్లెటో, చీరో.. ఇంకొంచం రిచ్ ఫీలింగ్ రావాలంటే వారి ఆర్థిక స్థోమతను బట్టి బంగారమో, డైమండ్ నెక్లెసో చేయిస్తాడు. కానీ ఓ ప్రియుడు తన ప్రియురాలి కోసం ఏకంగా రూ.100కోట్ల బిల్డింగ్ నే గిఫ్ట్ గా రాసిచ్చాడు. ఓ కేసు విషయమై ఆ బిల్డింగ్ లోకి విచారించగా విస్తుగొలిపే నిజాలు బయటకి వచ్చాయి.

Delhi: ప్రియురాలికి గిఫ్ట్‌గా రూ.100కోట్ల బిల్డింగ్.. పోలీసుల దర్యాప్తులో విస్తుగొల్పే నిజాలు

ఢిల్లీ: ఏ ప్రియుడైనా ప్రియురాలికి గిఫ్ట్(Lover Gift) గా ఏమిస్తాడు. ప్రత్యేక సందర్భాలుంటే చాక్లెటో, చీరో.. ఇంకొంచం రిచ్ ఫీలింగ్ రావాలంటే వారి ఆర్థిక స్థోమతను బట్టి బంగారమో, డైమండ్ నెక్లెసో చేయిస్తాడు. కానీ ఓ ప్రియుడు తన ప్రియురాలి కోసం ఏకంగా రూ.100 కోట్ల బిల్డింగ్ నే గిఫ్ట్ గా రాసిచ్చాడు. ఓ కేసు విషయమై ఆ బిల్డింగ్ లోకి విచారించగా విస్తుగొలిపే నిజాలు బయటకి వచ్చాయి. ఇందుకు సంబంధించిన వివరాలు... ఢిల్లీ పోలీసులు కొన్నేళ్లుగా స్క్రాప్ మాఫియాను అణచివేసేందుకు విసృతంగా దాడులు చేస్తున్నారు.

ఈ క్రమంలో రవి కన్హా అనే గ్యాంగ్ స్టర్ గురించి తెలిసింది. అతను రవీంద్ర నగర్ అనే కాలనీలో 16 మంది సభ్యులతో స్క్రాప్ మెటీరియల్ ని సేకరించి అక్రమంగా విక్రయిస్తున్నాడు. వచ్చిన డబ్బుతో ఢిల్లీలో బిల్డింగ్ కొనేశాడు. కొన్నాళ్లకు అతని లైఫ్ లోకి కాజల్ ఝా అనే యువతి వచ్చింది. తాను ఉద్యోగం కోసం వెతుకుతున్నానని రవికి చెప్పగా అతను చేస్తున్న బిజినెస్ లోనే ముఖ్య సభ్యురాలిగా ఆమెను చేర్చుకున్నాడు. తరువాత రవికి సంబంధించిన ఆర్థిక వ్యవహారాలన్నీ ఆమెనే చక్కబెట్టేది.


అలా వారి మధ్య చనువు పెరిగి ప్రేమలో పడ్డారు. ఈ క్రమంలో దక్షిణ ఢిల్లీ(Delhi)లోని పాష్ న్యూ ఫ్రెండ్స్ కాలనీలో దాదాపు రూ.100 కోట్ల విలువైన 3 అంతస్థుల భవనాన్ని ఆమెకు గిఫ్ట్ గా ఇచ్చాడు. స్క్రాప్ మాఫియాను పట్టుకునే క్రమంలో పోలీసులు ఆమె నివసిస్తున్న బిల్డింగ్ పై బుధవారం దాడులు నిర్వహించారు. పోలీసుల నుంచి ఝా, స్క్రాప్ మాఫియా తప్పించుకుంది. బిల్డింగ్ వివరాలను ఆరా తీయగా సంచలన విషయం బయటకి వచ్చింది.

ప్రియురాలి కోసం రవి అంత విలువైన బిల్డింగ్ ని కానుకగా ఇచ్చాడని తేలింది. స్క్రాప్ అక్రమ రవాణా చేస్తూ రూ.కోట్లు సంపాదించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. రవిపై ఇదివరకే 11కేసులు ఉన్నాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే నిందితులకు సంబంధించిన స్క్రాప్ గోడౌన్లపై దాడులు చేసి సీలు వేశారు. గ్యాంగ్ స్టర్ రవి అతని ప్రియురాలు, సభ్యులు ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

Updated Date - Jan 06 , 2024 | 01:59 PM