Share News

West Bengal: ఉపాధ్యాయులు భర్తీ స్కాం.. మమత ప్రభుత్వానికి గట్టి దెబ్బ

ABN , Publish Date - Apr 22 , 2024 | 01:05 PM

కోల్‌కత్తా హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలల్లో నియమించిన 24 వేల ఉపాధ్యాయుల నియామకాన్ని రద్దు చేసింది. జస్టిస్ దేబాంగుశ్‌ బసక్, షబ్బార్ రషీద్‌తో కూడిన ధర్మాసనం సోమవారం ఈ మేరకు ఆదేశించింది.

West Bengal: ఉపాధ్యాయులు భర్తీ స్కాం.. మమత ప్రభుత్వానికి గట్టి దెబ్బ
Mamata Banerjee

కోల్‌కత్తా, ఏప్రిల్ 22: కోల్‌కత్తా హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. ఎయిడెడ్ పాఠశాలల్లో నియమించిన 24 వేల ఉపాధ్యాయులు, ఉపాధ్యాయేతరుల నియామకాన్ని రద్దు చేసింది. జస్టిస్ దేబాంగుశ్‌ బసక్, షబ్బార్ రషీద్‌తో కూడిన ధర్మాసనం సోమవారం ఈ మేరకు ఆదేశించింది. ఈ మొత్తం భర్తీ నియామక ప్రక్రియను సీబీఐతో విచారణ జరిపించాలని ఆ ఆదేశాల్లో స్పష్టం చేసింది. దీనిపై మూడు నెలల్లో హైకోర్టుకు నివేదిక అందించాలని సీబీఐని కోరింది.

Kerala: కేరళలో బర్డ్‌ఫ్లూ స్వైర విహారం సరిహద్దుల్లో నిఘా తీవ్రతరం

అయితే కోల్‌కత్తా హైకోర్టు తీసుకున్న తాజా నిర్ణయం.. మమతా ప్రభుత్వానికి పెద్ద దెబ్బ అనే అభిప్రాయం అయితే రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. అయితే ఈ మొత్తం ఉపాధ్యాయ, ఉపాధ్యాయేతర భర్తీ ప్రక్రియ మళ్లీ తాజాగా నిర్వహించాలని సూచించింది. ఇక ఈ ప్రక్రియ అంతా పశ్చిమ బెంగాల్ స్కూల్ సర్వీస్ కమిషన్‌ ద్వారా భర్తీ జరగాలని ఆ ఆదేశాల్లో ధర్మాసనం స్పష్టం చేసింది.


Tamilnadu : తిరువణ్ణామలైలో రేపు చిత్రా పౌర్ణమి

ఇక 2016లో ఎయిడ్ స్కూళ్లలో ఉపాధ్యాయులు, ఉపాధ్యాయేతరుల భర్తీకి రాష్ట ప్రభుత్వం స్టేట్ లెవెల్ సెలక్షన్ టెస్ట్ నిర్వహించింది. మొత్తం 24,640 ఉపాధ్యాయల పోస్ట్‌లకు ఈ పరీక్ష నిర్వహించారు. దీంతో దాదాపు 23 లక్షల మంది ఈ పరీక్షకు హాజరయ్యారు.

జాతీయ వార్తలు కోసం...

Updated Date - Apr 22 , 2024 | 04:08 PM