Share News

Veerappan: వీరప్పన్‌ కుమార్తె ఎన్టీకే అభ్యర్థి.. భార్య డీఎంకేకు మద్దతుగా ప్రచారం

ABN , Publish Date - Apr 11 , 2024 | 10:18 AM

కృష్ణగిరి లోక్‌సభ నియోజకవర్గంలో నామ్‌ తమిళర్‌ కట్చి అభ్యర్థిగా గంధపు చెక్కల స్మగ్లర్‌ వీరప్పన్‌(Veerappan) కుమార్తె విద్యారాణి పోటీ చేస్తున్నారు. ఆమె తల్లి, వీరప్పన్‌ భార్య ముత్తులక్ష్మి కుమార్తెకు మద్దతుగా ప్రచారంలో పాల్గొనకుండా ధర్మపురిలో డీఎంకేను గెలిపించాలంటూ ఇం టింటా తిరిగి ఓట్లు అభ్యర్థిస్తున్నారు.

Veerappan: వీరప్పన్‌ కుమార్తె ఎన్టీకే అభ్యర్థి.. భార్య డీఎంకేకు మద్దతుగా ప్రచారం

చెన్నై: కృష్ణగిరి లోక్‌సభ నియోజకవర్గంలో నామ్‌ తమిళర్‌ కట్చి అభ్యర్థిగా గంధపు చెక్కల స్మగ్లర్‌ వీరప్పన్‌(Veerappan) కుమార్తె విద్యారాణి పోటీ చేస్తున్నారు. ఆమె తల్లి, వీరప్పన్‌ భార్య ముత్తులక్ష్మి కుమార్తెకు మద్దతుగా ప్రచారంలో పాల్గొనకుండా ధర్మపురిలో డీఎంకేను గెలిపించాలంటూ ఇం టింటా తిరిగి ఓట్లు అభ్యర్థిస్తున్నారు. ముత్తులక్ష్మి తమిళగ వాల్వురిమై కట్చి సభ్యురాలు. ఆ పార్టీ ప్రస్తుతం డీఎంకే కూటమిలో భాగస్వామ్యం వహిస్తున్న కారణంగా ధర్మపురి డీఎంకే అభ్యర్థి మణికి మద్దతుగా ప్రచారంలో పాల్గొంటున్నారు. ఈ ఎన్నికల్లో కుమార్తె ఒక పార్టీలోను, తల్లి మరో పార్టీకి మద్దతుగా వ్యవహరించడం గమనార్హం.

nani3.jpg

ఇదికూడా చదవండి: BJP: రాసిపెట్టుకోండి... తమిళనాట బీజేపీ హవా ఖాయం..

Updated Date - Apr 11 , 2024 | 01:10 PM