Share News

Prashant Kishor: పీకే పార్టీకి గట్టి దెబ్బ.. కోర్ కమిటీకి మాజీ ఎంపీలు గుడ్‌బై

ABN , Publish Date - Dec 17 , 2024 | 06:53 PM

బీహార్ రాజకీయ ముఖచిత్రాన్ని మారుస్తాననే నినాదంతో గత అక్టోబర్ 2వ తేదీన 'జన్ సూరజ్' పార్టీని ప్రశాంత్ కిషోర్ ప్రారంభించారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా మాజీ ఐఎఫ్ఎస్ అధికారి మనోజ్ భారతిని ప్రకటించారు.

Prashant Kishor: పీకే పార్టీకి గట్టి దెబ్బ.. కోర్ కమిటీకి మాజీ ఎంపీలు గుడ్‌బై

పాట్నా: వచ్చే ఏడాది బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో 'జన్ సురాజ్' (Jan Suraaj) వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్ (Prashant Kishor)కు గట్టి దెబ్బ తగిలింది. 125 మంది సభ్యుల జన్‌ సురాజ్ కోర్ కమిటీకి మాజీ ఎంపీలు దేవేంద్ర ప్రసాద్, మునజిర్ హసన్‌ మంగళవారంనాడు రాజీనామా చేశారు. ప్రశాంత్ కిషోర్ పనితీరుపై ఈ ఇద్దరు నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. అయితే, కోర్ కమిటీ నుంచి తాము తప్పుకున్నప్పటికీ ఇంకా పార్టీకి వీడలేదని వారు వివరణ ఇచ్చారు.

Uddhav Thackeray: సావర్కర్‌కు భారతరత్న ఇవ్వాలి, కాంగ్రెస్ సైతం ఆ పని మానాలి


బీహార్ రాజకీయ ముఖచిత్రాన్ని మారుస్తాననే నినాదంతో గత అక్టోబర్ 2వ తేదీన 'జన్ సురాజ్' పార్టీని ప్రశాంత్ కిషోర్ ప్రారంభించారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా మాజీ ఐఎఫ్ఎస్ అధికారి మనోజ్ భారతిని ప్రకటించారు. వచ్చే ఏడాది మార్చిలో పార్టీ సంస్థాగత ఎన్నికలు జరిగేంతవరకూ ఆయన ఈ పదవిలో ఉంటారని తెలిపారు.


దీనికి ముందు, రాష్ట్రంలో అభివృద్ధిలేమికి చిరకాలంగా ఎదురవుతున్న రాజకీయ సవాళ్లకు సరికొత్త రాజకీయ ప్రత్యామ్యాయంగా నిలుస్తామంటూ రెండేళ్ల పాటు బీహార్ వ్యాప్తంగా 3,000 కిలోమీటర్ల పాదయాత్రను ప్రశాంత్ కిషోర్ పూర్తి చేశారు. మహాత్మాగాంధీ తొలి సత్యాగ్రహాన్ని ప్రారంభించిన చంపరాన్ నుంచే తన పాదయాత్ర ప్రారంభించి గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న అధికారికంగా పార్టీని ప్రారంభించారు.


ఇవి కూడా చదవండి..

Priyanka Gandhi: నిన్న పాలస్తీనా, నేడు బంగ్లా బ్యాగ్‌

Kasturi: గర్భాలయంలోకి ఎవరికీ ప్రవేశం లేదు..

Ajit Doval: చైనా పర్యటనకు అజిత్ ఢోబాల్

For National News And Telugu News

Updated Date - Dec 17 , 2024 | 06:53 PM