Share News

Lok Sabha Elections: 42 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన టీఎంసీ

ABN , Publish Date - Mar 10 , 2024 | 03:14 PM

'ఇండియా' కూటమిలో భాగస్వామిగా ఉన్న తృణమూల్ కాంగ్రెస్ పార్టీ పశ్చిమబెంగాల్‌ లో పొత్తుల వ్యవహరంలో కాంగ్రెస్ పార్టీకి మొండిచేయి చూపింది. ఒంటరిగానే లోక్‌సభ ఎన్నికల బరిలోకి దిగింది. 42 లోక్‌సభ స్థానాలకు పోటీ చేసే అభ్యర్థుల పేర్లను మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ ఆదివారంనాడు ప్రకటించారు.

Lok Sabha Elections: 42 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన టీఎంసీ

బెంగాల్: 'ఇండియా' (I.N.D.I.A.) కూటమిలో భాగస్వామిగా ఉన్న తృణమూల్ కాంగ్రెస్ పార్టీ (TMC) పశ్చిమబెంగాల్‌ (West Bengal)లో పొత్తుల వ్యవహరంలో కాంగ్రెస్ పార్టీకి మొండిచేయి చూపింది. ఒంటరిగానే లోక్‌సభ ఎన్నికల బరిలోకి దిగింది. 42 లోక్‌సభ స్థానాలకు పోటీ చేసే అభ్యర్థుల పేర్లను మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ (Abhishek Banerjee) ఆదివారంనాడు ప్రకటించారు. అభ్యర్థుల జాబితాలో డైమండ్ హార్బర్ నుంచి అభిషేక్ బెనర్జీకి టిక్కెట్ లభించగా, కృష్ణానగర్ నుంచి తిరిగి టీఎంసీ లోక్‌సభ బహిష్కృత నేత మహువా మొయిత్రాకు టిక్కెట్ దొరికింది.


ఎన్నికల ప్రచారం షురూ...

కాగా, కోల్‌కతా బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన భారీ కార్యక్రమంలో లోక్‌సభ ఎన్నికల ప్రచారానికి మమతా బెనర్జీ ఆదివారంనాడు శ్రీకారం చుట్టారు. ఎన్నికల ప్రచారం రోజే 42 మంది అభ్యర్థులను ప్రకటిస్తున్నామని, టీఎంసీకి అఖండ విజయం అందించాలని మమతా బెనర్జీ సభా వేదిక నుంచి పిలుపునిచ్చారు. యూసుఫ్ పఠాన్, శత్రుఘ్నసిన్హాలకు కూడా చోటు దక్కింది.


పూర్తి జాబితా ఇదే..

1.కూచ్ బెహర్ : జగదీష్ చంద్ర బసునియా

2.అలీపుర్‌ద్వారా: ప్రకాష్ చిక్బరాయ్

3. జల్‌పాయ్‌గురి: నిర్మల్ రాయ్

4. డార్జిలింగ్: గోపాల్ లామా

5. రాయ్‌గంజ్: కృష్ణ క ల్యాణి

6. బాలుర్‌ఘాట్ : బిప్లవ్ మిత్రా

7. మాల్డా ఆన్సర్: ప్రసూన్ బనర్జీ

8. మాల్డా సౌత్: షాన్వాజ్ అలీ రెహ్మాన్

9. జాంగిపూర్: ఖలీలుల్ రెహ్మన్

10. బర్హంపూర్ : యూసుఫ్ పఠాన్

11. ముర్షీదాబాద్: అబు తహెర్ ఖాన్

12. కృష్ణానగర్ : మహువా మొయిత్రా

13. రాణాఘాట్: క్రౌన్ జెవెల్ ప్రొఫెసర్

14. బాంగావ్: బిశ్వజిత్ దాస్

15. బారాక్‌పోర్: పార్థ భౌమిక్

16. డుమ్ డుమ్: సౌగత్ రాయ్

17. బరాసత్ : కకలి ఘోష్ దస్తిదార్

18. బసిర్హట్: హాజి నురుల్ ఇస్లామ్

19. జయనగర్: ఫాతిమా మండల్

20. మధురాపూర్ : బపి హాల్దెర్

21. డైమండ్ హార్బర్: అభిషేక్ బెనర్జీ

22. జాదవ్‌పూర్ : సయని ఘోష్

23. కోల్‌కతా సౌత్ : మాలా రాయ్

24. కోల్‌కతా నార్త్: సుదీప్ బెనర్జీ

25. హౌరా: ప్రసూన్ బెనర్జీ

26.ఉలుబెరియా: సజ్ఞా అహ్మద్

27.శ్రీరామ్‌పూర్: కల్యాణ్ బెనర్జీ

28. హుగ్లీ: రచ్నా బెనర్జీ

29.అరాంబాఘ్: మిథాలి బాఘ్

30. తమ్లుక్: దేవాన్షు భట్టాచార్య

31. కాంతి: గుడ్ హౌస్‌కీపర్

32. ఘటల్ : దీపక్ అధికారి

33. ఝాగ్రాం: కాలిపద్ శరణ్

34. మేదినిపూర్: జూన్ మలియా

35. పురూలియా శాంతిరామ్ మహతో

36. బంకుర: అరుప్ చక్రవర్తి

37. బర్ద్వాన్ ఈస్ట్ : డాక్టర్ షర్మిల సర్కార్

38. బుర్ద్వాన్ ఆన్సర్ : కీర్తి ఆజాద్

39. అసాంసోల్ : శత్రుఘ్ను సిన్హా

40. బోల్‌పూర్ : అసిత్ కుమార్ మల్

41. బీర్భూ్మ్: శతాబ్ది రాయ్

42. బిష్ణుపూర్: సుజాత మండల్

Updated Date - Mar 10 , 2024 | 03:14 PM