Share News

Delhi: రైల్వే ప్రయాణికులకు రూ.50కే మీల్స్‌

ABN , Publish Date - Apr 24 , 2024 | 02:39 AM

న్యూఢిల్లీ, హైదరాబాద్‌, ఏప్రిల్‌ 23: రైళ్లలో జనరల్‌ బోగీలో ప్రయాణించే వారి కోసం రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఐఆర్‌సీటీసీ ఆధ్వర్యంలో ప్రయాణికులకు అందుబాటు ధరల్లో ఆహార పదార్థాలను అందించనుంది.

Delhi: రైల్వే ప్రయాణికులకు రూ.50కే మీల్స్‌

న్యూఢిల్లీ, హైదరాబాద్‌, ఏప్రిల్‌ 23: రైళ్లలో జనరల్‌ బోగీలో ప్రయాణించే వారి కోసం రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఐఆర్‌సీటీసీ ఆధ్వర్యంలో ప్రయాణికులకు అందుబాటు ధరల్లో ఆహార పదార్థాలను అందించనుంది. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేసింది. 20, 50 రూపాయలకే జనరల్‌ బోగీల్లో ప్రయాణించే వారి కోసం నాణ్యమైన భోజనం, స్నాక్స్‌ అందించాలని, ప్రస్తుతం వంద స్టేషన్లలో 150 కౌంటర్లు ఏర్పాటు చేశామని రైల్వే అధికారులు తెలిపారు.

వీటిని భవిష్యత్‌లో మరిన్ని స్టేషన్లకు విస్తీరించే అవకాశం ఉందన్నారు. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 12 స్టేషన్లలో 18 కౌంటర్లు ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. తెలుగు రాష్ట్రాల నుంచి 10 స్టేషన్లు ఉన్నాయి. హైదరాబాద్‌, వికారాబాద్‌, విజయవాడ, రేణిగుంట, తిరుపతి, పాకాల, రాజమండ్రి, డోన్‌, నంద్యాల, గుంతకల్‌ రైల్వే స్టేషన్లలో ఎకానమీ మీల్స్‌ అందించనున్నారు.

Updated Date - Apr 24 , 2024 | 06:36 AM