Share News

Swati Maliwal assault case: సీఎం సహాయకుడికి బెయిల్ నిరాకరణ

ABN , Publish Date - May 27 , 2024 | 07:22 PM

ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్ పై దాడి ఆరోపణలు ఎదుర్కొంటున్న ముఖ్యమంత్రి కేజ్రీవాల్ వ్యక్తిగత సహాయకుడు బిభవ్ కుమార్ కు ఢిల్లీ తీజ్ హజారీ కోర్టులో చుక్కెదురైంది. ఆయన దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్‌ను కోర్టు సోమవారంనాడు తోసిపుచ్చింది.

Swati Maliwal assault case: సీఎం సహాయకుడికి బెయిల్ నిరాకరణ

న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్ (Swati Malival)పై దాడి ఆరోపణలు ఎదుర్కొంటున్న ముఖ్యమంత్రి కేజ్రీవాల్ వ్యక్తిగత సహాయకుడు బిభవ్ కుమార్ (Bibhav Kumar)కు ఢిల్లీ తీజ్ హజారీ కోర్టులో చుక్కెదురైంది. ఆయన దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్‌ను కోర్టు సోమవారంనాడు తోసిపుచ్చింది. మే 13న దాడి ఘటనపై స్వాతి మలివాల్ ఫిర్యాదుపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు బిభవ్ కుమార్‌ను అరెస్టు చేయడంతో ప్రస్తుతం ఆయన జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు.


బెయిలు కోరుతూ బిభవ్ కుమార్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టిన కోర్టు ఇరువైపు వాదనలు విన్న తర్వాత తీర్పును రిజర్వ్ చేసింది. అనంతరం తీర్పును వెలువరిస్తూ బెయిలును నిరాకరించింది. కోర్టులో వాదనల సందర్భంగా డిఫెన్స్ కౌన్సిల్ వాదనలు వినిపిస్తుండగా స్వాతి మలివాల్ కంటతడి పెట్టారు. ''వాళ్లకు చాలా పెద్ద ట్రోల్ మెషనరీ ఉంధి. ఆ యంత్రాంగాన్ని అంతా ఉపయోగిస్తున్నారు. నిందితుడిని పార్టీ నేతలు ముంబై, లక్నో తీసుకెళ్లారు. అతన్ని బెయిలుపై విడుదల చేస్తే నాకు, నా కుటుంబానికి ముప్పు ఉంటుంది'' అని కోర్టుకు స్వాతి మలివాల్ విన్నవించారు. బిభవ్ కుమార్ సాధారణ వ్యక్తి కాదని, మంత్రులకు కల్పించే అన్ని సౌకర్యాలు ఆయనకు ఉన్నాయని చెప్పారు.

Maliwal Assault Case: కోర్టులో కంటతడి పెట్టిన స్వాతి మలివాల్


దీనికి ముందు, బిభవ్ కుమార్ తరఫు న్యాయవాది ఎన్.హరిహరన్ తన వాదన వినిపిస్తూ, మలివాల్ ముందస్తు అనుమతి లేకుండా ముఖ్యమంత్రి నివాసంలో చొరబడ్డారని, అప్పుడు సీఎంలో ఇంట్లో బిభవ్ లేరని, ఆ తర్వాతే అతన్ని పిలిపించారని చెప్పారు. భద్రతా సిబ్బంది ఆమెను ఆపినప్పుడు ఎంపీని వెయిట్ చేయిస్తారా అంటూ నిలదీశారని తెలిపారు. ఎంపీ చెబుతున్నట్టు వైటల్ పార్ట్‌లో ఎలాంటి తీవ్ర గాయాలు లేవనీ, ఉద్దేశపూర్వకమైన దాడికి అవకాశమే లేదనీ, అవి సొంతంగా చేసుకున్న గాయాలు కావచ్చని వాదించారు. ముందస్తు వ్యూహంతో, టైలర్ మేడ్ కథనంతో మలివాల్ దాడి ఆరోపణలు చేశారని చెప్పారు. తన క్లయింట్‌ను నిర్దోషిగా విడిచిపెట్టమని తాను కోరడం లేదని, బెయిల్ మాత్రమే కోరుతున్నానని అన్నారు.

Read National News and Latest News here

Updated Date - May 27 , 2024 | 07:22 PM