Special train: హుబ్లీ - రామేశ్వరం మధ్య ప్రత్యేక రైలు
ABN , Publish Date - Mar 19 , 2024 | 11:06 AM
కర్ణాటక రాష్ట్రం హుబ్లీ - రామేశ్వరం(Hubli - Rameswaram) మధ్య వారాంతపు ప్రత్యేక రైలు ఏప్రిల్ 6 నుంచి జూన్ 30వ తేది వరకు నడపనున్నట్లు దక్షిణ రైల్వే తెలిపింది.
చెన్నై: కర్ణాటక రాష్ట్రం హుబ్లీ - రామేశ్వరం(Hubli - Rameswaram) మధ్య వారాంతపు ప్రత్యేక రైలు ఏప్రిల్ 6 నుంచి జూన్ 30వ తేది వరకు నడపనున్నట్లు దక్షిణ రైల్వే తెలిపింది. హుబ్లీ నుంచి శనివారాల్లో ఉదయం 6.30 గంటలకు బయల్దేరే ఈ రైలు మరుసటిరోజు ఉదయం 6.15 గంటలకు రామేశ్వరం చేరుకుంటుంది. మరో మార్గంలో ఏప్రిల్ 7 నుంచి జూన్ 30వ తేది వర కు ప్రతి ఆదివారం రామేశ్వరం నుంచి రాత్రి 9 గంటలకు బయల్దేరి మరుసటిరోజు రాత్రి 7.25 గంటలకు హుబ్లీ చేరుకుంటుంది. ఈ రైలు రామేశ్వరం నుంచి రామనాథపురం, మానామధురై, కారైక్కుడి, పుదుకోట, తిరుచ్చి, కరూర్, నామక్కల్, ధర్మపురి, హోసూరు, హరిహర్ మీదుగా హుబ్లీ చేరుకుంటుంది. ఈ రైలుకు గాను రిజర్వేషన్ సోమవారం ప్రారంభమైంది.