Share News

Lok Sabha election 2024: రేపే ఆరో దశ పోలింగ్..ఆరు రాష్ట్రాల్లోని 58 స్థానాలకు ఓటింగ్

ABN , Publish Date - May 24 , 2024 | 09:59 PM

లోక్‌సభ ఎన్నికల(Lok Sabha election 2024) ఆరో దశ(Phase 6) పోలింగ్ కోసం సర్వం సిద్ధమైంది. ఈ దశలో ఢిల్లీలోని మొత్తం ఏడు స్థానాలతో సహా ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 58 స్థానాలకు శనివారం(మే 25న) ఓటింగ్ జరగనుంది.

Lok Sabha election 2024: రేపే ఆరో దశ పోలింగ్..ఆరు రాష్ట్రాల్లోని 58 స్థానాలకు ఓటింగ్
Sixth phase of polling tomorrow Voting for 58 seats

లోక్‌సభ ఎన్నికల(Lok Sabha election 2024) ఆరో దశ(Phase 6) పోలింగ్ కోసం సర్వం సిద్ధమైంది. ఈ దశలో ఢిల్లీలోని మొత్తం ఏడు స్థానాలతో సహా ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 58 స్థానాలకు శనివారం(మే 25న) ఓటింగ్ జరగనుంది. ఈ దశలో 11 కోట్ల మంది ఓటర్లు 889 మంది అభ్యర్థుల ఎన్నికల భవితవ్యాన్ని నిర్ణయించనున్నారు. జమ్మూ కాశ్మీర్‌లోని అనంత్‌నాగ్-రాజౌరీ స్థానానికి కూడా శనివారం ఓటింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో పలు ఎన్నికల నియోజక వర్గాలపై తుపాను ప్రభావం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది.


ఈ దశలో 11.13 కోట్ల మందికి పైగా ప్రజలు ఓటు(vote) వేయడానికి అర్హులుగా ఉన్నారు. వీరిలో 5.84 కోట్ల మంది పురుషులు కాగా, 5.29 కోట్ల మంది మహిళలు ఉన్నారు. 5,120 మంది 'థర్డ్ జెండర్' ఓటర్లు ఉన్నారు. ఇక మిగిలిన 57 స్థానాలకు ఏడో దశలో జూన్ 1న తుది దశ ఓటింగ్ నిర్వహించి, జూన్ 4న ఓట్ల లెక్కింపు జరగనుంది. ఇప్పటివరకు 25 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 428 స్థానాలకు ఓటింగ్‌ పూర్తయింది.


ఆరో దశలో(Phase 6) ఒడిశాలోని కొన్ని లోక్‌సభ, అసెంబ్లీ స్థానాలతో పాటు పశ్చిమ బెంగాల్‌లోని కొన్ని పార్లమెంటు స్థానాలకు శనివారం ఓటింగ్ జరగనుంది. సంబల్‌పూర్ (ఒడిశా) నుంచి ధర్మేంద్ర ప్రధాన్ (బీజేపీ), ఈశాన్య ఢిల్లీ నుంచి మనోజ్ తివారీ (బీజేపీ), కన్హయ్య కుమార్ (కాంగ్రెస్), సుల్తాన్‌పూర్ (ఉత్తరప్రదేశ్), అనంత్‌నాగ్-రాజౌరీ నుంచి మేనకా గాంధీ (బీజేపీ) ఆరో దశ ప్రధాన అభ్యర్థులుగా ఉన్నారు.


ఇది కూడా చదవండి:

Bank Holidays: జూన్ 2024లో బ్యాంకు సెలవులు ఎన్ని రోజులో తెలుసా..ఈసారి ఏకంగా.

Mileage Tips: పెట్రోల్, డీజిల్ ఎంత పోయించుకుంటే బెటర్.. ఫుల్ ట్యాంక్ లేదా లీటర్

Read Latest News and National News here

Updated Date - May 24 , 2024 | 09:59 PM