Share News

Siddaramaiah: నేను సీఎంగా ఉండాలంటే.. వరుణలో 60వేల మెజారిటీ రావాలి

ABN , Publish Date - Apr 02 , 2024 | 12:14 PM

మైసూరు జిల్లాలో మూడు రోజుల పర్యటనలో భాగంగా మంగళవారం ముఖ్యమంత్రి సిద్దరామయ్య(Chief Minister Siddaramaiah) బిళిగెరెలో కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. వరుణ(Varuna) తన అదృష్ట నియోజకవర్గమని, తాను రెండుసార్లు సీఎం కావడానికి ప్రజల ఆశీస్సులే కారణమని అన్నారు.

Siddaramaiah: నేను సీఎంగా ఉండాలంటే.. వరుణలో 60వేల మెజారిటీ రావాలి

- ముఖ్యమంత్రి సిద్దరామయ్య

బెంగళూరు: మైసూరు జిల్లాలో మూడు రోజుల పర్యటనలో భాగంగా మంగళవారం ముఖ్యమంత్రి సిద్దరామయ్య(Chief Minister Siddaramaiah) బిళిగెరెలో కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. వరుణ(Varuna) తన అదృష్ట నియోజకవర్గమని, తాను రెండుసార్లు సీఎం కావడానికి ప్రజల ఆశీస్సులే కారణమని అన్నారు. ప్రస్తుతం తాను సీఎంగా కొనసాగాలంటే చామరాజనగర లోక్‌సభ అభ్యర్థిగా బరిలో ఉన్న సునిల్‌బోస్ ను తప్పక గెలిపించాలని, వరుణ పరిధిలో కనీసం 60వేల మెజారిటీ రావాలని కోరారు. తాము అమలు చేస్తు న్న ఐదు గ్యారెంటీ పథకాలతో అన్ని వర్గాల ప్రజలు ప్రయోజనం పొందుతున్నారని తెలిపారు. అంతకుముందు టి. నరసీపుర బహిరంగసభలో సీఎం మాట్లాడుతూ దేశ ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇచ్చిన హామీలు నెరవేర్చలేదన్నారు. ప్రధాని మోదీ పదేళ్లలో ప్రజలకు ఏం చేశారో బహిరంగంగా చెప్పాలని డిమాండ్‌ చేశారు. విదేశాల నుంచి నల్లధనం రాలేదని, ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు కల్పించలేదని, రైతుల ఆదాయం పెరగలేదని తెలిపారు. కానీ 8నెలల క్రితం శాసనసభ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన ఐదు గ్యారెంటీలు రాష్ట్రమంతటా అమలు చేస్తున్నామన్నారు. చామరాజనగర రిజర్వు నియోజకవర్గం నుంచి మంత్రి మహదేవప్ప కుమారుడు సునిల్‌బోస్‌ కాంగ్రెస్‌ అభ్యర్థిగా బరిలో నిలిచాడు. ఆయనకు మద్దతుగా స్వయంగా సీఎం ప్రచారం చేస్తున్నారు. ఆశ్రయ సమితి చైర్మన్‌ యతీంద్ర సిద్దరామయ్య, గ్యారెం టీ అమలు కమిటీ వైస్‌చైర్మన్‌ పుష్పాఅమరనాథ్‌తోపాటు పలువురు పాల్గొన్నారు.

Updated Date - Apr 02 , 2024 | 12:14 PM