Share News

Satyapradasahu: రూ.4 కోట్లపై విచారణకు ప్రత్యేక కమిటీ.. రూ.208 కోట్ల విలువైన నగలు, బహుమతుల స్వాధీనం

ABN , Publish Date - Apr 09 , 2024 | 10:15 AM

స్థానిక తాంబరం వద్ద నెల్లై ఎక్స్‌ప్రె్‌సలో రూ.4 కోట్ల నగదు పట్టుబడిన వ్యవహారంలో ఆదాయపు పన్ను శాఖ ప్రత్యేక కమిటీ విచారణ జరుపుతుందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సత్యప్రదసాహు(Chief Election Officer Satya Pradasahu) ప్రకటించారు.

Satyapradasahu: రూ.4 కోట్లపై విచారణకు ప్రత్యేక కమిటీ.. రూ.208 కోట్ల విలువైన నగలు, బహుమతుల స్వాధీనం

- ఓట్ల లెక్కింపు వరకు ఎన్నికల కోడ్‌

- ఎన్నికల ప్రధానాధికారి సత్యప్రదసాహు

చెన్నై: స్థానిక తాంబరం వద్ద నెల్లై ఎక్స్‌ప్రెస్ లో రూ.4 కోట్ల నగదు పట్టుబడిన వ్యవహారంలో ఆదాయపు పన్ను శాఖ ప్రత్యేక కమిటీ విచారణ జరుపుతుందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సత్యప్రదసాహు(Chief Election Officer Satya Pradasahu) ప్రకటించారు. ఈ వ్యవహారంపై ఎన్నికల వ్యయ పరిశీలకులు విచారణ నివేదిక అందజేస్తారని తెలిపారు. చెన్నైలో సత్యప్రదసాహు మీడియాతో మాట్లాడుతూ... రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికలు ఈనెల 19వ తేదీతో ముగిసినా జూన్‌ 4వ తేది వరకు ఎన్నికల నిబంధనలు అమలులో ఉంటాయన్నారు. రాష్ట్రంలో ఎన్నికలు ముగిసినా కేరళ, కర్ణాటక, పొరుగు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్న దృష్ట్యా, వాటిని పరిగణనలోకి తీసుకొని ఓట్ల లెక్కింపు వరకు కోడ్‌ అమలులో ఉంటుందని తెలిపారు. ఎన్నికల్లో నగదు, బహుమతుల బట్వాడా అడ్డుకొనేలా రాష్ట్రవ్యాప్తంగా ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ అధికారులు తనిఖీలు చేపట్టారన్నారు. తగిన ఆధారాలు లేకుండా రూ.50,000కు పైగా నగదు, బంగారం, బహుమతులు తీసుకెళ్తుంటే వాటిని స్వాధీనం చేసుకుంటున్నామని తెలిపారు. అందులో భాగంగా చెన్నై నుంచి తిరునెల్వేలికి రైలులో తగిన ఆధారాలు లేకుండా తీసుకెళ్తున్న రూ.4 కోట్ల నగదును ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ అధికారులు స్వాధీనం చేసుకున్న వ్యవహారంపై రెవెన్యూ శాఖ ప్రత్యేక కమిటీ విచారణ చేపడుతుందని తెలిపారు.

నగలు, వస్తువులు స్వాధీనం...

రాష్ట్రవ్యాప్తంగా సోమవారం మధ్యాహ్నం వరకు రూ.208 కోట్ల విలువైన నగదు, వస్తువులు స్వాధీనం చేసుకున్నామన్నారు. అందులో రూ.88.12 కోట్ల నగదు, రూ.4.53 కోట్ల విలువైన మద్యం బాటిళ్లు, ఐ ఫోన్లు, చీరలు, ధోవతులు, స్టీలు పాత్రలు సహా పలురకాల వస్తువులున్నాయని తెలిపారు. కాగా రాష్ట్రంలో ఇప్పటివరకు 2.08 కోట్ల మందికి బూత్‌ స్లిప్పులు అందజేశామని సత్యప్రదసాహు తెలిపారు.

ఇదికూడా చదవండి: Minister Udayanidhi: స్టాలిన్‌ ప్రతిపాదించే వ్యక్తే ప్రధాని అవుతారు...

Updated Date - Apr 09 , 2024 | 10:15 AM