Share News

LS Polls: కన్ఫ్యూజన్‌లో ఎస్పీ.. అభ్యర్థుల మార్పు వెనుక అసలు రహస్యం..!

ABN , Publish Date - Apr 02 , 2024 | 11:12 AM

దేశంలో అత్యధిక లోక్‌సభ స్థానాలు కలిగిన ఉత్తరప్రదేశ్‌లో ఎన్డీయే కూటమి విజయపరంపరకు బ్రేక్ వేసేందుకు సమాజ్‌వాదీ పార్టీ వ్యూహాలు సిద్ధం చేస్తోంది. ఇండియా కూటమిలో భాగ స్వామిగా ఉన్న ఎస్పీ, కాంగ్రెస్, టీఎంసీ కలిసి యూపీలో పోటీ చేస్తున్నారు.

LS Polls: కన్ఫ్యూజన్‌లో ఎస్పీ.. అభ్యర్థుల మార్పు వెనుక అసలు రహస్యం..!

దేశంలో అత్యధిక లోక్‌సభ స్థానాలు కలిగిన ఉత్తరప్రదేశ్‌(Uttar Pradesh )లో ఎన్డీయే కూటమి విజయపరంపరకు బ్రేక్ వేసేందుకు సమాజ్‌వాదీ పార్టీ వ్యూహాలు సిద్ధం చేస్తోంది. ఇండియా (INDIA) కూటమిలో భాగస్వామిగా ఉన్న ఎస్పీ, కాంగ్రెస్, టీఎంసీ కలిసి యూపీలో పోటీ చేస్తున్నారు. సీట్ల సర్ధుబాటు జరిగింది. దీంతో గెలుపు కోసం ప్రచార రంగంలోకి దిగాయి ప్రధాన పార్టీలు. అయితే అభ్యర్థుల ఎంపిక విషయంలో సమాజ్ వాదీ పార్టీ కన్ఫ్యూజన్‌లో ఉన్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించిన నియోజకవర్గాల్లో అభ్యర్థులను మారుస్తోంది. ఇప్పటివరకు ముగ్గురు అభ్యర్థులను ఎస్పీ మార్చగా.. తాజాగా మరో స్థానంలోనూ అభ్యర్థిని మార్చింది. సోమవారం సమాజ్‌వాదీ పార్టీ ఇద్దరి పేర్లతో కూడిన జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో మీరట్ నుండి తన అభ్యర్థిని మారుస్తున్నట్లు ప్రకటించింది. గతంలో నోయిడా, బదౌన్, మొరాదాబాద్‌లలో కూడా పార్టీ అభ్యర్థులను మార్చింది. ముఖ్యంగా ఎవరి ఒత్తిడితో ఎస్పీ మార్పులు చేస్తుంది.. మొదట ప్రకటిచిన అభ్యర్థులను మార్చాల్సిన అవసరం ఏమిటనే చర్చ జరుగుతోంది.

Elections 2024: ఆర్థిక మంత్రులు లోక్ సభ ఎన్నికల్లో ఎందుకు పోటీ చేయరు.. ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్..

మీరట్, ఆగ్రా నుంచి..

తాజాగా మీరట్ నుంచి అతుల్ ప్రధాన్‌, ఆగ్రా నుంచి సురేష్ చంద్ కదమ్‌ను ఎస్పీగా అభ్యర్థులుగా ప్రకటించింది. అయితే మీరట్‌ అభ్యర్థిగా గతంలో భాను ప్రతాప్‌ను ప్రకటించిది. ప్రస్తుతం భాను ప్రతాప్‌ను మారుస్తూ.. ఆయన స్థానంలో అతుల్ ప్రధాన్ పోటీ చేస్తారని సమాజ్ వాదీ పార్టీ ప్రకటించింది. గతంలో నోయిడా, బదౌన్, మొరాదాబాద్ లలో ఎస్పీ తన అభ్యర్థులను మార్చింది. అభ్యర్థులను మార్చారు.

నలుగురి పేర్లలో అతుల్ ప్రధాన్..

మీరట్‌ స్థానం నుంచి షాహిద్ మంజూర్, రఫిక్ అన్సారీ, సర్ధానా ఎమ్మెల్యే అతుల్ ప్రధాన్ పేర్లు చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. అలాగే యోగేష్ వర్మ అనే మరో పేరు తెరపైకి వచ్చింది. చివరికి సర్ధాన ఎమ్మెల్యే అతుల్ ప్రధాన్ పేరును ఎస్పీ అధికారికంగా ప్రకటించింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Sumalatha: ఇంకా టిక్కెట్ ఇవ్వలేదు.. త్వరలోనే నిర్ణయం వెల్లడిస్తా.. సుమలత కామెంట్స్..

Updated Date - Apr 02 , 2024 | 11:12 AM