Share News

బీజేపీ మళ్లీ వస్తే రిజర్వేషన్లు రద్దు: రాహుల్‌

ABN , Publish Date - Apr 28 , 2024 | 03:37 AM

ప్రజాస్వామ్యాన్ని నాశనం చేసి, రాజ్యాంగాన్ని మార్చివేయడమే బీజేపీ లక్ష్యమని కాంగ్రెస్‌ నాయకుడు రాహుల్‌ గాంధీ ఆరోపించారు.

బీజేపీ మళ్లీ వస్తే రిజర్వేషన్లు రద్దు: రాహుల్‌
Rahul

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 27: ప్రజాస్వామ్యాన్ని నాశనం చేసి, రాజ్యాంగాన్ని మార్చివేయడమే బీజేపీ లక్ష్యమని కాంగ్రెస్‌ నాయకుడు రాహుల్‌ గాంధీ ఆరోపించారు. వారు మళ్లీ అధికారంలోకి వస్తే దళితులు, గిరిజనులు, బీసీలకు రిజర్వేషన్లు ఎత్తివేస్తారని చెప్పారు.


ఇందుకు ఆ పార్టీ నాయకులు చేస్తున్న ప్రకటనలు, వ్యాఖ్యలే నిదర్శనమని తెలిపారు. కాంగ్రెస్‌ ఉన్నంతవరకు ఏ శక్తీ రిజర్వేషన్లను తొలగించలేదని హామీ ఇచ్చారు. ఈ మేరకు శనివారం హిందీలో ట్వీట్‌ చేశారు. రిజర్వేషన్లను ఎత్తివేయాలన్నది బీజేపీ ఆలోచన కాగా, ఆ పార్టీ మాత్రం కాంగ్రెస్‌ వస్తే రిజర్వేషన్లు తీసివేస్తారని తప్పుడు ప్రచారం చేస్తోందని ఆరోపించారు.

Updated Date - Apr 28 , 2024 | 03:58 AM