Share News

Rain Alert: తమిళనాడులో ‘రెడ్ అలర్ట్’ జారీ

ABN , Publish Date - May 19 , 2024 | 07:08 AM

తమిళనాడు: రాష్ట్ర వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ నేపథ్యంలో ఆదివారం నుంచి మంగళవారం మధ్య రాష్ట్రానికి ‘రెడ్ అలర్ట్’ జారీ చేసింది. ఈనెల 22వ తేదీ నాటికి నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది.

Rain Alert: తమిళనాడులో  ‘రెడ్ అలర్ట్’ జారీ

తమిళనాడు: రాష్ట్ర వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు (Heavy Rains) కురుస్తాయని భారత వాతావరణ శాఖ (Indian Meteorological Department) అంచనా వేసింది. ఈ నేపథ్యంలో ఆదివారం నుంచి మంగళవారం మధ్య రాష్ట్రానికి ‘రెడ్ అలర్ట్’ (Red Alert) జారీ చేసింది. ఈనెల 22వ తేదీ నాటికి నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది. దీని ప్రభావంతో 24న మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనంగా మారుతుందని ఐఎండీ (IMD) తెలిపింది.


కాగా తమిళనాడులో పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. కన్యాకుమారి, తేని, టెన్ కాశి, కోయంబత్తూరు, పుడుకొట్టై, తంజావూర్, తిరునల్వేలి, తూత్తుకుడి జిల్లాలో నాలుగు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. సేలం, ధర్మపురి, క్రిష్ణగిరి, తిరుపూర్, విరుదునగర్, నీలగిరి జిల్లాలకు ఆది, సోమవారాలు (రెండు రోజులు) భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. రాష్ట్ర ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.


తమిళనాడులో కురుస్తున్న వర్షాలకు జలపాతాలు పొంగిపొర్లుతున్నాయి. శుక్రవారం కుర్తాళం జలపాతాన్ని వరద నీరు ముంచెత్తింది. నీలగిరి పర్వత శ్రేణులలో ఎడతెరిపిలేని వర్షాలు కురిశాయి. ప్రముఖ పర్యాటక కేంద్రం ఊటీలోనూ కుండపోత వర్షం కురిసింది. ఈ క్రమంలో ఊటీ ప్రయాణాన్ని వాయిదా వేసుకోవాలని పర్యాటకులకు వాతావరణ శాఖ సూచించింది.


ఈ వార్తలు కూడా చదవండి..

ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం..

ఇదంతా బురదే కదా అనుకుంటే పొరపాటే..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - May 19 , 2024 | 07:08 AM