Share News

Rajinikanth, Vijay: ‘సూపర్‌స్టార్‌’ రజినీకాంత్‏కు‏‏ హీరో విజయ్‌ ఫోన్‌.. భవిష్యత్‌ ప్రణాళికను వివరించిన దళపతి

ABN , Publish Date - Feb 09 , 2024 | 11:44 AM

సూపర్‌స్టార్‌’ రజినీకాంత్‌(Rajinikanth)తో తనకు మనస్పర్థలున్నాయంటూ జరుగుతున్న ప్రచారానికి అగ్రహీరో ‘దళపతి’ విజయ్‌(Vijay) ఫుల్‌స్టాప్‌ పెట్టే ప్రయత్నం చేశారు.

Rajinikanth, Vijay: ‘సూపర్‌స్టార్‌’ రజినీకాంత్‏కు‏‏ హీరో విజయ్‌ ఫోన్‌.. భవిష్యత్‌ ప్రణాళికను వివరించిన దళపతి

అడయార్‌(చెన్నై): ‘సూపర్‌స్టార్‌’ రజినీకాంత్‌(Rajinikanth)తో తనకు మనస్పర్థలున్నాయంటూ జరుగుతున్న ప్రచారానికి అగ్రహీరో ‘దళపతి’ విజయ్‌(Vijay) ఫుల్‌స్టాప్‌ పెట్టే ప్రయత్నం చేశారు. ఆయన స్వయంగా రజనీకి ఫోన్‌ చేయడంతో పాటు తన కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు కోసం వివరించారు. ‘తమిళ వెట్రి కళగం’ పేరుతో విజయ్‌ కొత్త రాజకీయ పార్టీని స్థాపించగా, రజనీకాంత్‌ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలిపిన విషయం తెలిసిందే. ఇందుకు కృతజ్ఞతలు తెలిపేందుకు రజనీకి విజయ్‌ ఫోన్‌ చేశారు. ఈ సందర్భంగా విజయ్‌ తన కొత్త రాజకీయ పార్టీ సిద్ధాంతాలు, రాజకీయ పరిస్థితులు, ప్రజాక్షేత్రంలోకి పార్టీని తీసుకెళ్ళేందుకు తన వద్ద ఉన్న ప్రణాళికలు తదితర అంశాలను వివరించినట్టు సమాచారం. కేవలం పార్టీని స్థాపించడమే కాకుండా, రాజకీయాల్లో రాణించేందుకు అనుసరించాల్సిన వ్యూహాలు, మహిళలను, యువతను ఆకట్టుకునేందుకు చేపట్టాల్సిన చర్యలు తదితర అంశాల గురించి వారిద్దరి మధ్య చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది. కాగా, తమిళగ వెట్రి కళగం పేరుతో రాజకీయ పార్టీని ప్రారంభించిన విజయ్‌.. ప్రస్తుతం తాను కమిట్‌ అయిన సినిమా ప్రాజెక్టులను పూర్తి చేసిన తర్వాత పూర్తిస్థాయిలో రాజకీయాల్లోకి రానున్నట్టు ప్రకటించిన విషయం తెల్సిందే. దీంతో చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు విజయ్‌కు శుభాకాంక్షలు చెబుతున్నారు.

Updated Date - Feb 09 , 2024 | 11:44 AM