Covid-19: సీఎంకు కోవిడ్ పాజిటివ్
ABN , Publish Date - Mar 06 , 2024 | 03:15 PM
కోవిడ్ భయాలు తగ్గుముఖం పట్టినప్పటికీ అడపాదడపా కోవిడ్ కేసులు వెలుగుచూస్తున్నాయి. రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్‌లాల్ శర్మ తాజాగా కోవిడ్ బారిన పడ్డారు. కోవిడ్ పాజిటివ్‌గా వైద్యులు నిర్ధారించారు.

జైపూర్: కోవిడ్ (Covid-19) భయాలు తగ్గుముఖం పట్టినప్పటికీ అడపాదడపా కోవిడ్ కేసులు వెలుగుచూస్తున్నాయి. రాజస్థాన్ (Rajasthan) ముఖ్యమంత్రి భజన్‌లాల్ శర్మ (Bhajanlal Sharma) తాజాగా కోవిడ్ బారిన పడ్డారు. కోవిడ్ పాజిటివ్‌గా వైద్యులు నిర్ధారించారు. ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో వైద్య పరీక్షలు చేయించుకున్నానని, పరీక్షల్లో కోవిడ్ పాజిటివ్ వచ్చిందని భజన్‌లాల్ శర్మ 'ఎక్స్' వేదికగా వెల్లడించారు. వైద్యుల సలహా మేరకు ప్రస్తుతం తాను ఐసొలేషన్‌లో ఉన్నానని, రోజువారీ కార్యక్రమాల్లో వర్చువల్‌గా పాల్గొంటానని అయన తెలిపారు.