Share News

Raja: అబ్బో.. రాజాగారి ఆస్తులు బాగానే పెరిగాయిగా.. మొత్తం ఎంతో తెలిస్తే..

ABN , Publish Date - Mar 29 , 2024 | 10:07 AM

నీలగిరి రిజర్వుడు నియోజకవర్గంలో పోటీ చేస్తున్న డీఎంకే అభ్యర్థి ఎ.రాజా(A. Raja) రూ.21.61 కోట్ల మేరకు చర, స్థిరాస్తులు కలిగి ఉన్నారు. ఈ మేరకు తన నామినేషన్‌లో అఫిడవిట్‌ను సమర్పించారు.

Raja: అబ్బో.. రాజాగారి ఆస్తులు బాగానే పెరిగాయిగా.. మొత్తం ఎంతో తెలిస్తే..

- మురుగన్‌ ఆస్తులు రూ. 2.37 కోట్లు

చెన్నై: నీలగిరి రిజర్వుడు నియోజకవర్గంలో పోటీ చేస్తున్న డీఎంకే అభ్యర్థి ఎ.రాజా(A. Raja) రూ.21.61 కోట్ల మేరకు చర, స్థిరాస్తులు కలిగి ఉన్నారు. ఈ మేరకు తన నామినేషన్‌లో అఫిడవిట్‌ను సమర్పించారు. ఆ వివరాల మేరకు రాజాకు రూ.3.73 కోట్ల మేరకు చరాస్తులున్నాయి. ఆయన కుమార్తె మయూరి పేరుతో రూ.2.88 కోట్ల చరాస్తులున్నాయి. రాజా వద్ద 108 సవర్ల బంగారు నగలు, 4,182 కేజీల వెండి నగలు, కుమార్తె వద్ద రూ.1,93 కోట్ల విలువైన నగలు రూ.12 లక్షల విలువ చేసే వజ్రాభరణాలున్నాయి. కుమార్తె మయూరి పేరిట తిరుచ్చి, పెరంబలూరులో రూ. 15.43 కోట్ల విలువైన 10.53 ఎకరాల విస్తీర్ణం కలిగిన భూములు ఉన్నాయి. పెరంబలూరులో రూ.7.25లక్షల విలువైన పూర్వీకుల నివాసగృహం ఉంది. ఉమ్మడి కుటుంబం ద్వారా సంక్రమించిన ఆస్తులు రూ.9.79లక్షలని ఆయన పేర్కొన్నారు.

మురుగన్‌ ఆస్తులు రూ. 2.37 కోట్లు...

ఈ నియోజకవర్గంలో బీజేపీ(BJP) తరఫున పోటీ చేస్తున్న కేంద్ర మంత్రి ఎల్‌ మురుగన్‌ రూ.2.37 కోట్ల విలువైన చర, స్థిరాస్తులు కలిగి ఉన్నారు. నామినేషన్‌తో జతపరచిని అఫిడవిట్‌ వివరాల ప్రకారం ఆయన రూ.1.01 కోట్ల చరాస్తులు, రూ.16లక్షల విలువైన స్థిరాస్తులు కలిగి ఉన్నారు. రూ.50 వేల నగదు, ఆయన భార్య కలైయరసి వద్ద రూ.72 వేల నగదు ఉన్నాయి. ఢిల్లీలోని కెనరా బ్యాంక్‌లో ఆయన పేరుపై రూ.61,694లు, అక్కడి స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా శాఖలో రూ.22,44,829లు చొప్పున డిపాజిట్లు ఉన్నారు. భార్య కలైయరసి పేరుపై చెన్నై కీల్పాక్‌లోని స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా శాఖలో రూ.7,98,515 డిపాజిట్‌ చేసి ఉన్నారు. సైదాపేట ఇండియన్‌ బ్యాంక్‌లో రూ.11,516 నగదు పొదుపు చేశారు. ఎల్‌ఐసీ, ప్రైవేటు సంస్థలలో రూ.60లక్షల 38 వేలకు పైగా బీమా చేసి ఉన్నారు. భార్య కలైయరసి పేరుపై ఎల్‌ఐసీ, ప్రైవేటు సంస్థల్లో రూ.46 లక్షల 35 వేల చొప్పున బీమా చేసి ఉన్నారు. ఇక మురుగన్‌ వద్ద రూ.5లక్షల విలువైన కారు ఉంది. భార్య వద్ద రూ.40 వేల హోండా యాక్టివా స్కూటర్‌ ఉంది. మురుగన్‌ పేరుపై రూ.11లక్షల విలువైన 240 గ్రాముల బంగారు నగలు ఉన్నాయి. భార్య వద్ద రూ.33 లక్షల విలువైన 720 గ్రామలు బంగారు నగలు ఉన్నాయి. మురుగన్‌ ఢిల్లీలోని స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో రూ.20లక్షల రుణం పొంది ఉన్నారు. ఆయన భార్య చెన్నై అన్నా నగర్‌ స్టేట్‌ బ్యాంక్‌ శాఖలో రూ.90లక్షల దాకా రుణం, మరో బ్యాంక్‌లో రూ.10లక్షల రుణం పొంది ఉన్నారు.

Updated Date - Mar 29 , 2024 | 10:41 AM