Share News

Rains: నైరుతి బంగాళాఖాతంపై బాహ్య ఉపరితల ద్రోణి.. 12 వరకు వర్ష సూచన

ABN , Publish Date - Jan 07 , 2024 | 09:24 AM

లక్ష్యద్వీప్‌, దానిపరసర ప్రాంతం, నైరుతి బంగాళాఖాతంపై ఆవహించివున్న బాహ్య ఉపరితల ద్రోణి కారణంగా ఈనెల 12వ తేదీ వరకు వర్ష సూచన ఉందని చెన్నై ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలిపింది.

Rains: నైరుతి బంగాళాఖాతంపై బాహ్య ఉపరితల ద్రోణి.. 12 వరకు వర్ష సూచన

- వాతావరణ శాఖ వెల్లడి

అడయార్‌(చెన్నై): లక్ష్యద్వీప్‌, దానిపరసర ప్రాంతం, నైరుతి బంగాళాఖాతంపై ఆవహించివున్న బాహ్య ఉపరితల ద్రోణి కారణంగా ఈనెల 12వ తేదీ వరకు వర్ష సూచన ఉందని చెన్నై ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ విషయంపై శనివారం ఒక పత్రికా ప్రకటన విడుదల చేసింది. నీలగిరి, కోయంబత్తూరు, తిరుపూరు, తేని, దిండిగల్‌, మదురై, విరుదునగర్‌, తెన్‌కాశి, తూత్తుక్కుడి, తిరునెల్వేలి, కన్నియాకుమారి ప్రాంతాల్లో ఒకటి రెండు చోట్ల భారీ వర్షానికి అవకాశం ఉందని తెలిపింది. పుదుచ్చేరి, కారైక్కాల్‌(Karaikkal, Puducherry) ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపిం ది. అదేవిధంగా కడలూరు, విల్లుపురం, పుదుచ్చేరి ప్రాం తాల్లో భారీ వర్షం, తిరువళ్లూరు, చెన్నై, చెంగల్పట్టు, కాంచీపురం, తిరువణ్ణామలై, రాణిపేట, కళ్ళకుర్చి, మైలాడుదురై ప్రాంతాల్లో భారీ వర్షానికి అవకాశం ఉందని తెలిపింది.

Updated Date - Jan 07 , 2024 | 09:24 AM