Share News

Rains: 20, 21 తేదీల్లో మోస్తరు వర్షాలు..

ABN , Publish Date - Mar 16 , 2024 | 10:41 AM

రాష్ట్రంలోని ఒకటి, రెండు ప్రాంతాలు, పుదుచ్చేరి, కారైక్కాల్‌ ప్రాంతాల్లో ఈ నెల 20, 21 తేదీల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని ప్రాంతీయ వాతావరణ పరిశోధన కేంద్రం తెలియజేసింది.

Rains: 20, 21 తేదీల్లో మోస్తరు వర్షాలు..

చెన్నై: రాష్ట్రంలోని ఒకటి, రెండు ప్రాంతాలు, పుదుచ్చేరి, కారైక్కాల్‌ ప్రాంతాల్లో ఈ నెల 20, 21 తేదీల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని ప్రాంతీయ వాతావరణ పరిశోధన కేంద్రం తెలియజేసింది. శుక్రవారం నుంచి 19వ తేది వరకు రాష్ట్రవ్యాప్తంగా పొడి వాతావరణం నెలకొంటుంది. పలు ప్రాం తాల్లో పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా 2 నుంచి 3 డిగ్రీలు పెరగనున్నాయి. రాజధాని నగరంలో చెన్నై(Chennai)లో రానున్న 48 గంటల్లో ఆకాశం మేఘావృతంగా ఉంటూ, పగటి ఉష్ణోగ్రతలు 34-35, రాత్రి ఉష్ణోగత్రలు 25-26 డిగ్రీల సెల్సియ్‌స నమోదయ్యే అవకాశముంది

Updated Date - Mar 16 , 2024 | 10:41 AM