Share News

Lok Sabha Results: రెండు చోట్లా 2 లక్షల పైచిలుకే..

ABN , Publish Date - Jun 04 , 2024 | 01:45 PM

లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న కొద్దీ కాంగ్రెస్, ఆ పార్టీ సారథ్యంలోని 'ఇండియా' కూటమిలో జోష్ పెరుగుతోంది. కేరళలోని వయనాడ్, ఉత్తరప్రదేశ్‌లోని రాయబరేలి నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ రెండు చోట్లా భారీ అధిక్యత దిశగా దూసుకుపోతున్నారు.

Lok Sabha Results: రెండు చోట్లా 2 లక్షల పైచిలుకే..

న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న కొద్దీ కాంగ్రెస్, ఆ పార్టీ సారథ్యంలోని 'ఇండియా' (I.N.D.I.A.)కూటమిలో జోష్ పెరుగుతోంది. కేరళలోని వయనాడ్, ఉత్తరప్రదేశ్‌లోని రాయబరేలి నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ (Rahul Gandhi) రెండు చోట్లా భారీ అధిక్యత దిశగా దూసుకుపోతున్నారు. మధ్యాహ్నం 12.15 గంటల ప్రాంతానికి రాయబరేలి నుంచి రాహుల్ గాంధీ 2 లక్షల 11 వేల 185 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. బీజేపీ అభ్యర్థి దినేష్ ప్రతాప్ సింగ్ బాగా వెనుకబడ్డారు. వయనాడ్‌లోనూ భారీ గెలుపు దిశగా రాహుల్ దూసుకెళ్తున్నారు. ఇక్కడ కూడా 2 లక్షల పైచిలుకు ఓట్ల ఆధిక్యం కొనసాగుతోంది. రెండో స్థానంలో సీపీఐ అభ్యర్థి అన్నే రాజా, మూడో స్థానంలో బీజేపీ అభ్యర్థి కె.సురేంద్రన్ ఉన్నారు. రాహుల్ గాంధీ ప్రస్తుతం వయనాడ్ ఎంపీగా ఉన్నారు.

Read Latest National News and Telugu News

Updated Date - Jun 04 , 2024 | 01:45 PM