Share News

Rahul Gandhi: బీజేపీకి అంత ధైర్యం లేదు.. రాహుల్ గాంధీ ఇలా ఎందుకన్నారంటే?

ABN , Publish Date - Mar 17 , 2024 | 03:50 PM

సార్వత్రిక ఎన్నికలు (Lok Sabha Elections) సమీపిస్తున్న తరుణంలో.. అధికార, ప్రతిపక్ష పార్టీ నేతలు తమ మాటల తూటాలకు మరింత పదును పెట్టారు. ఒకరిపై మరొకరు విమర్శలు - ప్రతివిమర్శలు, ఆరోపణలు - ప్రత్యారోపణలు చేసుకుంటున్నారు. ఇప్పుడు తాజాగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) అధికార బీజేపీపై (BJP) తారాస్థాయిలో విరుచుకుపడ్డారు.

Rahul Gandhi: బీజేపీకి అంత ధైర్యం లేదు.. రాహుల్ గాంధీ ఇలా ఎందుకన్నారంటే?

సార్వత్రిక ఎన్నికలు (Lok Sabha Elections) సమీపిస్తున్న తరుణంలో.. అధికార, ప్రతిపక్ష పార్టీ నేతలు తమ మాటల తూటాలకు మరింత పదును పెట్టారు. ఒకరిపై మరొకరు విమర్శలు - ప్రతివిమర్శలు, ఆరోపణలు - ప్రత్యారోపణలు చేసుకుంటున్నారు. ఇప్పుడు తాజాగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) అధికార బీజేపీపై (BJP) తారాస్థాయిలో విరుచుకుపడ్డారు. కేంద్రంలో ఉన్న బీజేపీ కేవలం హడావుడి మాత్రమే చేస్తుందని, కానీ రాజ్యాంగాన్నే మార్చే ధైర్యం ఆ పార్టీకి లేదని దుయ్యబట్టారు. సత్యం, దేశ ప్రజల మద్దతు తమవైపే ఉందని నమ్మకం వెలిబుచ్చారు. భారత్ జోడో న్యాయ యాత్ర ముగింపు సందర్భంగా ముంబయిలో నిర్వహించిన సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.


రాజ్యాంగాన్ని సవరించేందుకు పార్లమెంట్ (Parliament) ఉభయ సభల్లో బీజేపీకి మూడింట రెండు వంతుల మెజారిటీ అవసరమని బీజేపీ ఎంపీ అనంత్ కుమార్ హెగ్డే (Anant Kumar Hegde) ఇటీవల వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇందుకు రాహుల్ గాంధీ బదులిస్తూ.. ‘‘బీజేపీ పెద్దఎత్తున ఆర్భాటం చేస్తుంది కానీ, రాజ్యాంగాన్ని మార్చేంత ధైర్యం ఆ పార్టీకి లేదు. సత్యం, ప్రజల మద్దతు మా వైపే ఉంది’’ అని అన్నారు. ప్రస్తుతం జరుగుతున్న పోరు కేవలం బీజేపీ, కాంగ్రెస్ మధ్య కాదని.. రెండు సిద్ధాంతాల మధ్య పోటీ అని పేర్కొన్నారు. అధికారం మొత్తం ఒకే దగ్గర ఉండాలని వాళ్లు అనుకుంటున్నారని.. కానీ అధికార వికేంద్రీకరణ జరగాలని తాము భావిస్తున్నామని.. ప్రజల అభిప్రాయాలకు కూడా తాము విలువ ఇస్తామని చెప్పారు.

ఒక వ్యక్తి ఐఐటీ డిగ్రీ కలిగి ఉన్నంత మాత్రాన.. అతను రైతు కంటే ఎక్కువ తెలివైనవాడు కాదని రాహుల్ గాంధీ వివరించారు. అయితే.. జ్ఞానం అనేది ఒకరి వద్దే ఉందని.. రైతులు, కార్మికులు, నిరుద్యోగ యువతకు జ్ఞానం లేదని ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi), ఆర్ఎస్ఎస్‌లు (RSS) అనుకుంటుంటారని విమర్శించారు. మరోవైపు.. హెగ్డే చేసిన వ్యాఖ్యలకు ఆయన వ్యక్తిగత అభిప్రాయంగా బీజేపీ వివరణ ఇచ్చింది. అనంతరం.. ఆయన నుండి వివరణ కోరుతూ, ఈ వివాదాన్ని చల్లార్చేందుకు ఆ పార్టీ ప్రయత్నించింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Mar 17 , 2024 | 03:50 PM