Share News

Prajwal Revanna: ప్రజ్వల్‌కు లైంగిక సామర్ధ్య పరీక్షలు..?

ABN , Publish Date - May 31 , 2024 | 06:55 PM

పలువురు మహిళలపై లైంగిక దాడులు జరిపిన ఆరోపణలను ఎదుర్కొంటున్న హసన్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు శుక్రవారం ఉదయం వైద్య పరీక్షలు జరిపారు. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ పలువురు మహిళా పోలీసు అధికారుల ఎస్కార్ట్‌తో స్థానిక బౌరింగ్ అండ్ లేడీ కర్జన్ ఆసుపత్రికి తీసుకెళ్లింది. మహిళలపై లైంగిక దాడుల ఆరోపణలు ఉండటంతో ఆయనకు లైంగిక సామర్థ్య పరీక్షలు కూడా నిర్వహించారని తెలుస్తోంది.

Prajwal Revanna: ప్రజ్వల్‌కు లైంగిక సామర్ధ్య పరీక్షలు..?

బెంగళూరు: పలువురు మహిళలపై లైంగిక దాడులు జరిపిన ఆరోపణలను ఎదుర్కొంటున్న హసన్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు శుక్రవారం ఉదయం వైద్య పరీక్షలు జరిపారు. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (SIT) పలువురు మహిళా పోలీసు అధికారుల ఎస్కార్ట్‌తో స్థానిక బౌరింగ్ అండ్ లేడీ కర్జన్ ఆసుపత్రికి తీసుకెళ్లింది. మహిళలపై లైంగిక దాడుల ఆరోపణలు ఉండటంతో ఆయనకు లైంగిక సామర్థ్య పరీక్షలు (potency) కూడా నిర్వహించారని తెలుస్తోంది.

Prajwal Revanna: ప్రజ్వల్ రేవణ్ణకు 6 రోజుల పోలీసు కస్టడీ


లోక్‌సభ ఎన్నికలు మధ్యలో ఉండగా లైంగిక దాడుల ఆరోపణల వీడియోలు వెలుగుచూడటంతో జర్మనీకి పారిపోయిన ప్రజ్వల్‌ ఎట్టకేలకు మునిచ్ నుంచి గురువారం అర్థరాత్రి బెంగళూరు చేరుకున్నారు. కెంపెగౌడ విమానాశ్రయంలో అడుగుపెట్టగానే ఆయనను "సిట్'' టీమ్ అదుపులోనికి తీసుకుంది. ఆ వెంటనే ఐదుగురు మహిళా పోలీసులు ఆయనను హెడ్‌మూరికట్టిలోని సిట్ కార్యాలయానికి తీసుకెళ్లారు.

Updated Date - May 31 , 2024 | 06:59 PM