Share News

Prajwal Revanna: ప్రజ్వల్ రేవణ్ణకు 6 రోజుల పోలీసు కస్టడీ

ABN , Publish Date - May 31 , 2024 | 05:22 PM

రాసలీలల వీడియో కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సస్పెండెడ్ జేడీఎస్ ఎంపీ ప్రజల్వ్ రేవణ్ణకు బెంగళూరు కోర్టు ఆరు రోజుల సిట్ కస్టడీకి ఆదేశించింది. 14 రోజుల పాటు తమ కస్టడీకి అప్పగించాలని విచారణ సందర్భంగా కోర్టును ఇంతకుముందు సిట్ కోరింది.

Prajwal Revanna: ప్రజ్వల్ రేవణ్ణకు 6 రోజుల పోలీసు కస్టడీ

బెంగళూరు: రాసలీలల వీడియో కేసు (Obsecene video case)లో ఆరోపణలు ఎదుర్కొంటున్న సస్పెండెడ్ జేడీఎస్ (JDS) ఎంపీ ప్రజల్వ్ రేవణ్ణకు (Prajwal Revanna) బెంగళూరు కోర్టు ఆరు రోజుల సిట్ (SIT) కస్టడీకి ఆదేశించింది. జూన్ 6వ తేదీ వరకూ ఆయన కస్టడీలో ఉంటారు. 14 రోజుల పాటు తమ కస్టడీకి అప్పగించాలని విచారణ సందర్భంగా కోర్టును ఇంతకుముందు సిట్ కోరింది.


ప్రజ్వల్ రేవణ్ణను బెంగళురోలోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి సిట్ అధికారులు గురువారం రాత్రి అరెస్టు చేశారు. 34 రోజులుగా విదేశాల్లో తలదాచుకున్న ప్రజ్వల్ బెంగళూరు రాగా, ఐదుగురు మహిళా పోలీసులు ఆయనను హెడ్‌మూరికట్టిలోని సిట్ కార్యాలయానికి తీసుకువచ్చారు. లోక్‌సభ ఎన్నికల క్రమంలో అశ్లీల వీడియోలు వెలుగుచూడటంతో మే 26న ఆయన విదేశాలకు పారిపోయారు. కేసు దర్యాప్తును చేపట్టిన 'సిట్' నోటీసులు పంపినప్పటికీ ఆయన గడువు కోరడంతో సిట్ నిరాకరించింది. దీంతో ఆయనపై రెడ్ కార్నర్, బ్లూ కార్నర్ నోటీసులు పంపారు. ఈ నేపథ్యంలో ఆయన మే 30వ తేదీ మధ్యాహ్నం మ్యూనిచ్ నగరం నుంచి బయలుదేరి మే 30వ అర్ధరాత్రి కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు.

Updated Date - May 31 , 2024 | 07:03 PM