Share News

PM Modi: అంబేడ్కర్‌ను కాంగ్రెస్ అవమానించింది.. కాంగ్రెస్‌పై మోదీ విసుర్లు

ABN , Publish Date - Apr 14 , 2024 | 08:10 PM

పేదరికాన్ని ఒక్క చిటికలో నిర్మూలిస్తామన్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) వ్యాఖ్యలపై ప్రధాని మోదీ(PM Modi) మండిపడ్డారు. చిటికతో పేదరికం నిర్మూలిస్తామంటున్నారంటే ఆయన రాజ మాంత్రికుడేనని ఎగతాళి చేశారు. దేశ ప్రజలు ఆయన్ని సీరియస్‌గా తీసుకోవట్లేదని అన్నారు.

PM Modi: అంబేడ్కర్‌ను కాంగ్రెస్ అవమానించింది.. కాంగ్రెస్‌పై మోదీ విసుర్లు

హోషంగాబాద్: పేదరికాన్ని ఒక్క చిటికలో నిర్మూలిస్తామన్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) వ్యాఖ్యలపై ప్రధాని మోదీ(PM Modi) మండిపడ్డారు. చిటికతో పేదరికం నిర్మూలిస్తామంటున్నారంటే ఆయన రాజ మాంత్రికుడేనని ఎగతాళి చేశారు. దేశ ప్రజలు ఆయన్ని సీరియస్‌గా తీసుకోవట్లేదని అన్నారు. కాగా గత వారం రాజస్థాన్‌లో జరిగిన ఎన్నికల ప్రచారంలో రాహుల్‌గాంధీ మాట్లాడుతూ వచ్చే పార్లమెంట్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలిస్తే ఒకే ఒక దెబ్బతో దేశంలో పేదరికాన్ని లేకుండా చేస్తామన్నారు.

Lucknow: యూపీలో నడిరోడ్డుపై దారుణం.. ఇదేనా మీ నారీ శక్తి అంటూ బీజేపీపై మండిపడ్డ టీఎంసీ

‘దారిద్య్ర రేఖకు దిగువన ఉంటే మీ ఖాతాల్లోకి లక్ష రూపాయలు వచ్చి పడతాయి. డబ్బులు వస్తూనే ఉంటాయి మీ ఖాతాల్లోకి. ఒకే ఒక్క దెబ్బకు పేదరికం లేకుండా పోవాలి’అని రాహుల్‌ ప్రజలకు హామీ ఇచ్చారు. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న పేద కుంటుంబాల్లోని మహిళలకు ఒక్కొక్కరికి ఖాతాల్లో లక్ష రూపాయల చొప్పున జమ చేస్తామని కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. మధ్యప్రదేశ్‌లోని హోషంగాబాద్ లోక్‌సభ నియోజకవర్గంలోని పిపారియా పట్టణంలో జరిగిన ర్యాలీలో మోదీ ఆదివారం ప్రసంగించారు. రాహుల్ ఇచ్చిన హామీపై మోదీ మాట్లాడుతూ.. "రాజ మాంత్రికుడు ఇన్ని సంవత్సరాలు ఎక్కడికి పోయారు? ఆయన అమమ్మ(మాజీ ప్రధాని ఇందిరా గాంధీ) 50 ఏళ్ల క్రితం గరీబీ హఠావో నినాదం ఇచ్చారు.


మనువడు ఒక్క దెబ్బతో పేదరికాన్ని తొలిగిస్తానని అంటున్నారు. 2014కి ముందు రిమోట్‌ కంట్రోల్‌తో ప్రభుత్వాన్ని నడిపించారు. ఇప్పుడు ఇన్‌స్టంట్‌గా మంత్రం దొరికింది. ఇలాంటి ప్రకటనలు చేసి కాంగ్రెస్ నేతలు నవ్వులపావుతన్నారు. ఇది పేదల జోక్. ఇండియా కూటమిలోని సీపీఎం తన మేనిఫెస్టోలో అణు నిరాయుధీకరణకు పిలుపునిచ్చింది.

బలపడలేని పార్టీ దేశాన్ని బలపరచగలదా. దేశాన్ని రక్షించుకోవడానికి అణ్వాయుధాలు ఉండాలి. లేకపోతే రక్షించలేరు"అని మోదీ అన్నారు. అంబేడ్కర్‌ని కాంగ్రెస్ ఎప్పుడూ అవమానించేదని.. కానీ.. బీజేపీ ఆయన్ని గౌరవించిందన్నారు. బాబాసాహెబ్ రచించిన రాజ్యాంగం వల్లే తాను ఈ స్థాయిలో ఉన్నానన్నారు.

ఇండియా కూటమి మేనిఫెస్టోలోని ప్రతీ హామీ దేశాన్ని దివాలా తీయిస్తుందని హెచ్చరించారు. ఆదివాసీల (గిరిజనుల) సమస్యలను కాంగ్రెస్ ఎన్నడూ పట్టించుకోలేదని.. బీజేపీ ప్రభుత్వం వారి సమస్యలు తీర్చిందన్నారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగం కారణంగా, ఒక గిరిజన మహిళ భారత రాష్ట్రపతి అయ్యారని, దేశ అత్యున్నత రాజ్యాంగ పదవికి ద్రౌపది ముర్ము ఎన్నికైన విషయాన్ని ప్రస్తావిస్తూ ప్రధాని అన్నారు. "ఫిర్ ఏక్ బార్, మోదీ సర్కార్" నినాదం దేశవ్యాప్తంగా ప్రతిధ్వనిస్తోందని.. రాబోయే ఎన్నికల్లో ఇండియా కూటమికి బుద్ధి చెప్పాలని ప్రజలను కోరారు.

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Apr 14 , 2024 | 08:22 PM