PM Modi: అమ్మాయి పాదాలకు మోదీ ఎందుకు నమస్కరించారు?
ABN , Publish Date - Mar 08 , 2024 | 04:09 PM
దేశంలోనే తొలి సారిగా జాతీయ సృష్టికర్తల అవార్డుల పంపిణీ కార్యక్రమం శుక్రవారం ఢిల్లీలో(Delhi) ఘనంగా జరిగింది. భారత్ మండపంలో జరిగిన ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ క్రమంలో ఓ అమ్మాయి మోదీ(PM Modi) పాదాలను నమస్కరించబోయింది.
ఢిల్లీ: దేశంలోనే తొలి సారిగా జాతీయ సృష్టికర్తల అవార్డుల పంపిణీ కార్యక్రమం శుక్రవారం ఢిల్లీలో(Delhi) ఘనంగా జరిగింది. భారత్ మండపంలో జరిగిన ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ క్రమంలో ఓ అమ్మాయి మోదీ(PM Modi) పాదాలను నమస్కరించబోయింది.
మోదీ తిరిగి ఆమె పాదాలకు నమస్కరించారు. ఈ సంఘటన అక్కడున్న వారిని షాక్‌కి గురి చేసింది. పలువురు క్రియేటర్లకు ప్రధాని అవార్డులను అందించారు. ఆయన నుంచి అవార్డును అందుకుంటున్న క్రమంలో జాన్వీ సింగ్ అని యువతి మోదీ పాదాలకు నమస్కరించబోయింది. భారతీయ సంస్కృతిలో పెద్దలకు కాళ్లు మొక్కడం సహజమే. అలాగే జాన్వీ సింగ్ కూడా గౌరవ సూచకంగా ప్రధాని పాదాలను తాకింది.
వెంటనే మోదీ తిరిగి జాన్వీ సింగ్ పాదాలకు నమస్కరించారు. అలా చేయడం తనకు నచ్చదంటూ మోదీ చెప్పారు. హెరిటేజ్ ఫ్యాషన్ ఐకాన్ విభాగంలో జాన్వీ సింగ్ ఈ అవార్డును అందుకున్నారు. మోదీ అమ్మాయి కాళ్లకు తిరిగి నమస్కారించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
సెలబ్రిటీ సృష్టికర్త, గ్రీన్ ఛాంపియన్, సామాజిక మార్పు సృష్టికర్త, అత్యంత ప్రభావవంతమైన వ్యవసాయ సృష్టికర్త, సాంస్కృతిక రాయబారి, ఉత్తమ ప్రయాణ సృష్టికర్త, స్వచ్ఛతా అంబాసిడర్, న్యూ ఇండియా ఛాంపియన్, టెక్ క్రియేటర్‌తో సహా 20 విభాగాలలో అవార్డులు ప్రదానం చేశారు. ఈ కేటగిరీల్లో 1.5 లక్షలకు పైగా నామినేషన్లు వచ్చిన తర్వాత ముగ్గురు అంతర్జాతీయ సృష్టికర్తల సాయంతో విజేతలను నిర్ణయించారు.
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి