Share News

PM Modi: కాంగ్రెస్ న్యాయవ్యవస్థను గుప్పిట్లో పెట్టుకోవాలనుకుంది.. న్యాయవాదుల లేఖపై ప్రధాని మోదీ

ABN , Publish Date - Mar 28 , 2024 | 08:28 PM

న్యాయవ్యవస్థను దెబ్బ తీసేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తూ లాయర్లు సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్‌కి రాసిన లేఖపై ప్రధాని మోదీ(PM Modi) స్పందించారు. ఆయన మాట్లాడుతూ.. ఇతరులను వేధిస్తూ, వారిపై ఆగ్రహం వ్యక్తం చేయడం కాంగ్రెస్ సంస్కృతి అని విమర్శించారు.

PM Modi: కాంగ్రెస్ న్యాయవ్యవస్థను గుప్పిట్లో పెట్టుకోవాలనుకుంది.. న్యాయవాదుల లేఖపై ప్రధాని మోదీ

ఢిల్లీ: న్యాయవ్యవస్థను దెబ్బ తీసేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తూ లాయర్లు సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్‌కి రాసిన లేఖపై ప్రధాని మోదీ(PM Modi) స్పందించారు. ఆయన మాట్లాడుతూ.. ఇతరులను వేధిస్తూ, వారిపై ఆగ్రహం వ్యక్తం చేయడం కాంగ్రెస్ సంస్కృతి అని విమర్శించారు.

"5 దశాబ్దాల క్రితం కాంగ్రెస్ కేంద్రానికి కట్టుబడి ఉండే న్యాయవ్యవస్థ కోసం పిలుపునిచ్చారు. స్వార్థ ప్రయోజనాల కోసం ఇతరుల నుంచి నిబద్ధతను కోరుకుంటారు. కానీ దేశంపై ఎలాంటి నిబద్ధత చాటుకోరు. 140 కోట్ల మంది భారతీయులు వారిని ఎందుకు దూరం పెడుతున్నారో ఆశ్చర్యపోనవసరం లేదు" అని మోదీ విమర్శలు గుప్పించారు.


న్యాయవాదుల లేఖలో ఏముందంటే..

దేశంలో న్యాయవ్యవస్థ సమగ్రతను దెబ్బతీసే ప్రయత్నాలు జరుగుతున్నాయని న్యాయవాదులు ఆందోళన వ్యక్తం చేశారు. రాజకీయ నేతలకు సంబంధించిన కేసుల్లో కోర్టు తీర్పులను ప్రభావితం చేసేందుకు కొన్ని స్వార్థమూకలు తమపై ఒత్తిడి తెస్తున్నాయని ఆరోపించారు. ఈ మేరకు న్యాయవాదులు పింకీ ఆనంద్‌,

హరీశ్‌ సాల్వే సహా 600 మందికి పైగా లాయర్లు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌కు లేఖ రాశారు. త్వరలో ఎన్నికలు జరగనున్న వేళ ఈ లేఖ సంచలనం సృష్టిస్తోంది. రాజకీయ ఎజెండాతో కొన్ని గ్రూపులు న్యాయవ్యవస్థపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయని.. న్యాయపరమైన ప్రక్రియలను ప్రభావితం చేసి, కోర్టు ప్రతిష్ఠను దెబ్బతీయాలని చూస్తున్నాయని లేఖలో న్యాయవాదులు పేర్కొన్నారు. ఈ లేఖ తాజాగా దేశవ్యాప్తంగా పెను దుమారం రేపుతోంది.

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Mar 28 , 2024 | 08:28 PM