Share News

Elections 2024: పోటీ నుంచి తప్పుకున్న ఆజాద్.. ముఫ్తీ నామినేషన్ తో మంచుకొండల్లో ఎన్నికల వేడి..

ABN , Publish Date - Apr 18 , 2024 | 05:52 PM

జమ్మూ కశ్మీర్‌లో ఎన్నికల ( Elections 2024 ) వాతావరణం రోజురోజుకూ వేడెక్కుతోంది. అనంత్‌నాగ్‌ స్థానానికి పీడీపీ చీఫ్‌ మెహబూబా ముఫ్తీ నామినేషన్‌ దాఖలు చేయడంతో రాజకీయాలు రసవత్తరంగా మారాయి.

Elections 2024: పోటీ నుంచి తప్పుకున్న ఆజాద్.. ముఫ్తీ నామినేషన్ తో మంచుకొండల్లో ఎన్నికల వేడి..

జమ్మూ కశ్మీర్‌లో ఎన్నికల ( Elections 2024 ) వాతావరణం రోజురోజుకూ వేడెక్కుతోంది. అనంత్‌నాగ్‌ స్థానానికి పీడీపీ చీఫ్‌ మెహబూబా ముఫ్తీ నామినేషన్‌ దాఖలు చేయడంతో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. మాజీ ముఖ్యమంత్రి గులాం నబీ ఆజాద్ ఎన్నికల నుంచి తప్పుకోవడమే ఇందుకు ప్రధాన కారణం. ఈ మేరకు జమ్మూలో జరిగిన బహిరంగ సభలో హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. కశ్మీర్‌లో బీజేపీని పటిష్టం చేయడంలో తొందరపాటు ఏమీ లేదని ఆయన అన్నారు. ఈ క్రమంలో గులాం నబీ ఆజాద్‌ను తాను ఏ విషయంలోనూ పరిగణలోకి తీసుకోవడం లేదని ఎన్ఏసీ వైస్ ప్రెసిడెంట్ ఒమర్ అబ్దుల్లా స్ట్రాంగ్ కామెంట్ చేశారు. ఈ నిర్ణయం తీసుకునే ముందు గులాం నబీ ఆజాద్‌కు కాంగ్రెస్‌పై వ్యతిరేకత, బీజేపీపై ఉన్న ప్రేమ స్పష్టంగా కనిపిస్తున్నాయని ఎద్దేవా చేశారు.


Kejriwal: ఉద్దేశపూర్వకంగానే కేజ్రీవాల్ మామిడిపండ్లు తింటున్నారు.. ఈడీ ఆరోపణ..

2022లో కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన ఆజాద్ సొంత పార్టీని స్థాపించారు. దక్షిణ కశ్మీర్‌పై ప్రత్యేక దృష్టి సారించి మద్దతు కూడగట్టుకున్నారు. అనంత్‌నాగ్, పూంచ్, రాజౌరీలలోని పార్టీ నేతలతో సంప్రదింపులు జరిపారు. ఈ క్రమంలో ఎన్నికల నుంచి ఆజాద్ తప్పుకున్నారు. దీంతో అనంత్‌నాగ్‌ నుంచి మెహబూబా ముఫ్తీ బరిలోకి దిగారు. ఈ కారణంగా ఆజాద్ సొంత పార్టీ మనుగడ ప్రమాదంలో పడే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.


Bhadrachalam: రామయ్య పట్టాభిషేకం.. మురిసిపోయిన భక్తజనం..

మరోవైపు పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (పీడీపీ) అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ గురువారం మధ్యాహ్నం అనంతనాగ్ ఎన్నికల అధికారి కార్యాలయంలో నామినేషన్ పత్రాలు సమర్పించారు. నామినేషన్ పత్రాల సమర్పణ అనంతరం మీడియాతో మాట్లాడారు. 2019 ఆగస్టు 5న ప్రత్యేక అధికారాలు తొలగించిన తర్వాత విద్యుత్, నీరు, రేషన్, రోడ్డు కోసం తాము పోరాటం చేయడం లేదని చెప్పారు. అభివృద్ధి, ఉద్యోగాలు లేకుండా పోయాయని విమర్శించారు. ఇక్కడి వనరులను దోచుకుంటున్నారని మండిపడ్డారు. జమ్మూకశ్మీర్‌ను బహిరంగ జైలుగా మార్చారని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

మరిన్ని జాతీయం వార్తల కోసం క్లిక్ చేయండి.

Updated Date - Apr 18 , 2024 | 06:55 PM