Share News

Delhi: సుప్రీం కోర్టును ఆశ్రయించిన 700 మంది ప్రభుత్వ ఉద్యోగులు.. ఎందుకంటే

ABN , Publish Date - Apr 11 , 2024 | 10:03 PM

ఉద్యోగాల నుంచి తొలగించడాన్ని సవాలు చేస్తూ త్రిపురకు(Tripura) చెందిన 700 మంది ప్రభుత్వ ఉద్యోగులు సుప్రీంకోర్టు(Supreme Court) తలుపు తట్టారు. త్రిపురకు చెందిన 700 మంది అండర్ గ్రాడ్యుయేట్ ఉపాధ్యాయులపై రాష్ట్ర ప్రభుత్వం 2017, 2020లో తొలగింపు ఉత్తర్వులు ఇచ్చింది.

Delhi: సుప్రీం కోర్టును ఆశ్రయించిన 700 మంది ప్రభుత్వ ఉద్యోగులు.. ఎందుకంటే

ఢిల్లీ: ఉద్యోగాల నుంచి తొలగించడాన్ని సవాలు చేస్తూ త్రిపురకు(Tripura) చెందిన 700 మంది ప్రభుత్వ ఉద్యోగులు సుప్రీంకోర్టు(Supreme Court) తలుపు తట్టారు. త్రిపురకు చెందిన 700 మంది అండర్ గ్రాడ్యుయేట్ ఉపాధ్యాయులపై రాష్ట్ర ప్రభుత్వం 2017, 2020లో తొలగింపు ఉత్తర్వులు ఇచ్చింది. వాటిని సవాలు చేస్తూ ఉద్యోగులు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 32 (రాజ్యాంగ పరిష్కారాల హక్కు) కింద దాఖలు చేసిన పిటిషన్‌లో 2014లో త్రిపుర హైకోర్టు ఓ సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగుల కోసం తీసుకొచ్చిన నియామక ప్రక్రియ "చట్టపరంగా చెడ్డది" అని చెప్పినట్లు పిటిషన్‌లో పేర్కొన్నారు.

Haryana: డ్రైవర్ మద్యం తాగటంతోనే స్కూల్ బస్సు ప్రమాద ఘటన.. ప్రిన్సిపల్ సహా ఇద్దరు అరెస్ట్

రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త నియామక విధానం వల్ల దాదాపు 10 వేల మంది కొత్త ఉద్యోగాల నియామకాన్ని హైకోర్టు పక్కన పెట్టిందని.. అందులో చాలా నియామకాలను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసిందని వారు తెలిపారు. త్రిపుర ప్రభుత్వం భారీ కుంభకోణానికి పాల్పడుతోందని న్యాయవాదులు తారిణి కె నాయక్, అమృత్ లాల్ సాహా, ఆదిత్య మిశ్రా ఆరోపించారు.


తొలగించిన ఉపాధ్యాయుల జీతం కోడ్‌లు ఇప్పటికీ యాక్టివ్‌గా ఉన్నాయని.. వారి నెలవారీ వేతనాలు రాష్ట్ర ఖజానాలో జమ అవుతున్నాయని.. ఈ డబ్బుని కొంతమంది అవినీతి అధికారులు, బ్యూరోక్రాట్లు దుర్వినియోగం చేస్తున్నారని పిటిషనర్లు ఆరోపించారు. త్రిపుర ప్రభుత్వం భారీ కుంభకోణానికి పాల్పడుతోందని వారు అన్నారు.

తొలగింపునకు గురైన ఉపాధ్యాయుల పరిస్థితి దారుణంగా ఉందని.. 160 మందికి పైగా ఉపాధ్యాయులు ఆర్థిక సమస్యలతో మరణించారని, చాలా మంది ఆత్మహత్యలు చేసుకున్నారని పిటిషన్‌లో పేర్కొన్నారు. రాష్ట్రంలోని పాఠశాల విద్యా వ్యవస్థ దుర్భర పరిస్థితిని కూడా పిటిషనర్లు ఎత్తిచూపారు. ఉపాధ్యాయుల కొరతతో విద్యార్థులు నాణ్యమైన విద్యకు దూరమవుతున్నారని అన్నారు. అకారణంగా తమను విధుల నుంచి తప్పించారని.. తిరిగి తమను విధుల్లోకి తీసుకునేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని పిటిషన్‌లో కోరారు.

మరిన్ని జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Apr 11 , 2024 | 10:03 PM