Share News

Road Accident: ఆడి కారు ఢీ: వృద్ధుడు మృతి..

ABN , Publish Date - May 26 , 2024 | 08:33 PM

రోడ్డు దాటుతున్న వృద్దుడుని ఆడి కారు ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని నోడియాలో ఆదివారం చోటు చేసుకుంది.

Road Accident: ఆడి కారు ఢీ: వృద్ధుడు మృతి..

నోయిడా, మే 26: రోడ్డు దాటుతున్న వృద్దుడిని ఆడి కారు ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని నోడియాలో ఆదివారం చోటు చేసుకుంది. నోయిడా సెక్టర్ 53లోని కాంచన్‌జంగ్ అపార్ట్‌మెంట్‌లో జనక్ దేవ్ షా (63) నివసిస్తున్నారు. ఆదివారం ఉధయం పాలపాకెట్ తీసుకు వచ్చేందుకు బయటకు వెళ్లారు. ఆ క్రమంలో రోడ్డు దాటుతుండగా ఆడి కారు బలంగా వచ్చి ఆయన్ని గుద్దింది.

AP Elections: సీఎస్ జవహర్ నిరూపిస్తే.. కాళ్లు పట్టుకుంటా!


దీంతో ఆయన గాలిలోకి పల్టీలు కొట్టి.. కింద పడ్డారు. దాంతో ఆయన అక్కడికక్కడే మరణించారు. స్థానికులు వెంటనే స్పందించి ఈ ప్రమాదంపై పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని... పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

Fire Accident: నవజాత శిశువులు మృతి: ఆసుపత్రి ఓనర్ అరెస్ట్


ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆ క్రమంలో సీసీ ఫుటేజ్‌లను పరిశీలించారు. ఆ క్రమంలో ప్రమాదానికి కారణమైన కారుతోపాటు యజమాని కోసం పోలీసులు గాలిస్తున్నారు. మృతుడు జనక్ దేవ్ షా ఆల్ ఇండియా రేడియోలో పని చేసి రిటైర్ అయ్యారని పోలీసులు తెలిపారు.

Read Latest Telangana News and National News

Read Latest AP News and Telugu News

Updated Date - May 26 , 2024 | 08:33 PM