Share News

Odisha Elections 2024: నవీన్ పట్నాయక్ పార్టీతో పొత్తుపై తేల్చిచెప్పిన బీజేపీ

ABN , Publish Date - Mar 22 , 2024 | 05:26 PM

ఒడిశాలో అప్రతిహతంగా పాలన సాగిస్తున్న ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ సారథ్యంలోని బీజేడీ తో పొత్తు పెట్టుకోనుందనే ఊహాగానాలకు భారతీయ జనతా పార్టీ తెరదించింది. బీజేడీతో ఎలాంటి పొత్తు ఉండదని, ఒంటరిగానే పోటీ చేస్తామని బీజేపీ ప్రకటించింది. బీజేపీ ఒడిశా అధ్యక్షుడు మన్‌మోహన్ సామల్ సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో ఈ మేరకు ఒక ప్రకటన చేశారు.

Odisha Elections 2024: నవీన్ పట్నాయక్ పార్టీతో పొత్తుపై తేల్చిచెప్పిన బీజేపీ

న్యూఢిల్లీ: ఒడిశాలో అప్రతిహతంగా పాలన సాగిస్తున్న ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ సారథ్యంలోని బీజేడీ (BJD)తో పొత్తు పెట్టుకోనుందనే ఊహాగానాలకు భారతీయ జనతా పార్టీ (BJP) తెరదించింది. బీజేడీతో ఎలాంటి పొత్తు ఉండదని, ఒంటరిగానే పోటీ చేస్తామని బీజేపీ ప్రకటించింది. బీజేపీ ఒడిశా అధ్యక్షుడు మన్‌మోహన్ సామల్ సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో ఈ మేరకు ఒక ప్రకటన చేశారు.


''అభివృద్ధి భారతావని, ఒడిశా అభివృద్ధి ప్రధానమంత్రి మోదీ లక్ష్యంగా ఉంది. 4.5 కోట్ల ఒడిశా ప్రజల అభివృద్ధి, ఆకాంక్షలను నెరవేర్చేందుకు మోదీ నాయకత్వం కట్టుబడి ఉంది. భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలోని 21 లోక్‌సభ స్థానాలు, 147 అసెంబ్లీ సీట్లను గెలుచుకుంటుంది. బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుంది'' అని మన్‌మోహన్ సామల్ తెలిపారు. ఇటీవల జరిగిన ఒక ఒపీనియన్ పోల్‌ ఒడిశాలోని 21 స్థానాలకు 13 సీట్లు బీజేపీ, బీజేడీ 8 సీట్లు గెలుచుకుంటుందని జోస్యం చెప్పింది.

మరిన్ని జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Mar 22 , 2024 | 05:26 PM