Share News

INDIA Bloc: ఎన్నికల తర్వాతే లీడర్ ఎన్నిక.. పవార్ నిశ్చితాభిప్రాయం

ABN , Publish Date - Jan 13 , 2024 | 05:46 PM

ముంబై: ఇండియా కూటమి (I.N.D.I.A. bloc) కన్వీనర్ నియామకంపై కూటమి నేతల మధ్య ఎలాంటి వివాదం లేదని ఎన్‌సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ (Sharad Pawar) శనివారంనాడు తెలిపారు. కూటమి ప్రధాని పేరు ప్రకటించి లోక్‌సభ ఎన్నికలకు వెళ్లాల్సిన అవసరం లేదని, ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత లీడర్‌ను ఎన్నుకోవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.

INDIA Bloc: ఎన్నికల తర్వాతే లీడర్ ఎన్నిక.. పవార్ నిశ్చితాభిప్రాయం

ముంబై: ఇండియా కూటమి (I.N.D.I.A. bloc) కన్వీనర్ నియామకంపై కూటమి నేతల మధ్య ఎలాంటి వివాదం లేదని ఎన్‌సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ (Sharad Pawar) శనివారంనాడు తెలిపారు. కూటమి ప్రధాని పేరు ప్రకటించి లోక్‌సభ ఎన్నికలకు వెళ్లాల్సిన అవసరం లేదని, ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత లీడర్‌ను ఎన్నుకోవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. పుణేలోని జున్నార్ నుంచి 'ఇండియా బ్లాక్' నేతల వర్చువల్ సమావేశంలో శనివారంనాడు పాల్గొన్న శరద్ పవార్ అనంతరం మీడియాతో మాట్లాడుతూ, మల్లికార్జున్ ఖర్గే చైర్‌పర్సన్‌గా జరిగిన సమావేశంలో నితీష్ కుమార్‌ను కన్వీనర్‌గా నియమించాలని కూటమి సభ్యులు సూచనలు చేశారని చెప్పారు. అయితే కూటమి చీఫ్‌లను ఏర్పాటు చేసుకుంటే సరిపోతుందని, కన్వీనర్‌ను నియమించాల్సి అవసరం లేదని నితీష్ చెప్పారని తెలిపారు.


''ముందుగానే కూటమి పీఎం పేరుతో లోక్‌సభ ఎన్నికలకు వెళ్లాల్సిన అవసరం లేదు. ఎన్నికల తర్వాత లీడర్‌ను ఎన్నుకోవచ్చు. మేము కచ్చితమైన ప్రత్నామ్నాయం కాగలమని మాత్రం చెప్పగలను. 1977లో ప్రధానమంత్రి అభ్యర్థిగా మొరార్జీ దేశాయ్ పేరుతో ఎన్నికలకు వెళ్లలేదు'' అని పవార్ చెప్పారు. విపక్ష పార్టీలన్నీ ఏకతాటిపైకి రావడం మాత్రం శుభపరిణామమని అన్నారు. ముందస్తు కార్యక్రమాలు ఉన్నందున వర్చువల్ మీటింగ్ చివరి వరకూ తాను లేనని పవార్ చెప్పారు.


మహారాష్ట్రలో సీట్ల షేరింగ్‌పై పవార్ మాట్లాడుతూ, చర్చలు జరుగుతున్నాయని, అవి కొలిక్కి రాగానే ఆ విషయాన్ని ప్రకటిస్తామని పవార్ చెప్పారు. ఇండియా బ్లాక్ కూటమి సమావేశంలో కలిసికట్టుగా చేపట్టనున్న కార్యక్రమాలు, విధానాలపై చర్చ వచ్చిందని, కమిటీ ఏర్పడిన తర్వాత దేశవ్యాప్తంగా చేపట్టే సంయుక్త ర్యాలీలపై నిర్ణయం ఉంటుందని చెప్పారు.


రామాలయంపై...

రామాలయం అంశంపై పవార్ మాట్లాడుతూ, అయోధ్యలో రామాలయాన్ని ఎవ్వరూ వ్యతిరేకించడం లేదని, అంసపూర్తిగా ఉన్న రామాలయంలో ఇప్పుడు ప్రాణప్రతిష్ట చేపట్టాలనుకోవడం వెనుక రాజకీయ ఉద్దేశాన్ని మాత్రమే ప్రశ్నిస్తున్నారని పవార్ చెప్పారు.

Updated Date - Jan 13 , 2024 | 05:46 PM