Share News

Ram Mandir: రామ్‌లల్లా ప్రతిష్ఠాపన కార్యక్రమం.. అక్కడ లైవ్ టెలికాస్ట్ ఆపారంటూ కేంద్రమంత్రి ఆరోపణలు

ABN , Publish Date - Jan 21 , 2024 | 04:09 PM

అయోధ్యలోని రామమందిరంలో రామ్‌లల్లా ప్రతిష్ఠాపన కార్యక్రమానికి మరికొన్ని గంటల సమయమే మిగిలుంది. ఈ వేడుకని భారతదేశ చరిత్రలోనే చిరస్మరణీయంగా నిలిచిపోయేలా ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే.. భారత్‌లోని రామ భక్తులందరూ ఈ కార్యక్రమాన్ని వీక్షించేలా ప్రత్యక్ష ప్రసారాలను ఏర్పాటు చేశారు.

Ram Mandir: రామ్‌లల్లా ప్రతిష్ఠాపన కార్యక్రమం.. అక్కడ లైవ్ టెలికాస్ట్ ఆపారంటూ కేంద్రమంత్రి ఆరోపణలు

అయోధ్యలోని రామమందిరంలో రామ్‌లల్లా ప్రతిష్ఠాపన కార్యక్రమానికి మరికొన్ని గంటల సమయమే మిగిలుంది. ఈ వేడుకని భారతదేశ చరిత్రలోనే చిరస్మరణీయంగా నిలిచిపోయేలా ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే.. భారత్‌లోని రామ భక్తులందరూ ఈ కార్యక్రమాన్ని వీక్షించేలా ప్రత్యక్ష ప్రసారాలను ఏర్పాటు చేశారు. అయితే.. ఈ ప్రసారాలపై తమిళనాడు ప్రభుత్వం నిషేధం విధించిందని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ఆరోపణలు గుప్పించారు. స్థానిక మీడియా కథనాన్ని ఉటంకిస్తూ.. రామ మందిర కార్యక్రమాలను తమిళనాడు ప్రభుత్వం బ్యాన్ చేసిందని, అక్కడి దేవాలయాల్లో పూజలు కూడా జరగడం లేదని పేర్కొన్నారు.


‘‘జనవరి 22వ తేదీన ఎంతో ప్రతిష్టాత్మకంగా జరగనున్న అయోధ్య రామ మందిర కార్యక్రమాల ప్రత్యక్ష ప్రసారాలపై తమిళనాడు ప్రభుత్వం నిషేధం విధించింది. ఆ రాష్ట్రంలో 200కి పైగా రాముని ఆలయాలు ఉన్నాయి. హెచ్‌ఆర్‌ & సీఈ ఆధ్వర్యంలో.. జనవరి 22న శ్రీరాముని పేట ఆలయాల్లో నిర్వహించే పూజలు, భజనలు, ప్రసాదాలు, అన్నదానం వంటి వాటికి కూడా అక్కడ అనుమతి లేదు. ప్రైవేట్‌గా దేవాలయాల్లో నిర్వహించిన కార్యక్రమాలను కూడా నిర్వహించకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు. మండపాలను కూల్చివేస్తామని నిర్వాహకులను బెదిరిస్తున్నారు. ఈ హిందూ-వ్యతిరేక వైఖరిని, ద్వేషాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను’’ అని ఎక్స్ వేదికగా నిర్మలా సీతారామన్ రాసుకొచ్చారు. ఈ ట్వీట్‌కి స్థానిక మీడియా రాసిన కథనాన్ని జోడించారు. ఇది.. ఇండియా కూటమి భాగస్వామి అయిన డీఎంకే హిందూ వ్యతిరేక ప్రయత్నమని ఆమె ఆరోపించారు.

అయితే.. నిర్మలా సీతారామన్ చేసిన ఆరోపణలను తమిళనాడు ప్రభుత్వం ఖండించింది. ‘హెచ్‌ఆర్ & సీఈ’ మంత్రి పీకే శేఖర్ మాట్లాడుతూ.. నిర్మలా సీతారామన్ వంటి ఉన్నత పదవిలో ఉన్న వ్యక్తి, ఇలా తప్పుడు వార్తలను వ్యాప్తి చేయడం నిజంగా దురదృష్టకరమని అన్నారు. రాముడి పేరిట ప్రత్యేక పూజలు, అన్నదానం లేదా ప్రసాదం పంపిణీ చేయడంపై భక్తులపై HR & CE డిపార్ట్‌మెంట్ ఎలాంటి నిషేధం విధించలేదని స్పష్టం చేశారు. ప్రజల దృష్టిని మరల్చేందుకు ఇలాంటి పుకార్లను ప్రచారం చేస్తున్నారని శేఖర్‌బాబు తెలిపారు.

Updated Date - Jan 21 , 2024 | 04:09 PM