Share News

LokSabha Elections: మొహువా మోయిత్రితో కలిసి స్టెపులు వేసిన దీదీ

ABN , Publish Date - May 03 , 2024 | 06:28 PM

ఎన్నికల ప్రచారంలో భాగంగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్టెపులు వేశారు. అందుకు సంబంధించిన వీడియో ఎక్స్‌లో వైరల్ అవుతుంది. గురువారం నడియా జిల్లాలోని తిహట్టాలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ మొహువా మోయిత్రికి మద్దతుగా సీఎం మమతా ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

LokSabha Elections: మొహువా మోయిత్రితో కలిసి స్టెపులు వేసిన దీదీ
Mamata Banerjee

కొల్‌కతా, మే 03: ఎన్నికల ప్రచారంలో భాగంగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్టెపులు వేశారు. అందుకు సంబంధించిన వీడియో ఎక్స్‌లో వైరల్ అవుతుంది. గురువారం నడియా జిల్లాలోని తిహట్టాలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ (టీఎంసీ) మొహువా మోయిత్రికి మద్దతుగా సీఎం మమతా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. మోదీ పాలనలో దేశంలో చోటు చేసుకుంటున్న పరిణామాలపై విమర్శలు గుప్పించారు. ఆ క్రమంలో యూనిఫార్మ్ సివిల్ కోడ్, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల హక్కులు ప్రమాదంలో పడతాయని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.

LokSabha Elections: మళ్లీ నామినేషన్ వేసిన రాహుల్ గాంధీ.. స్పందించిన అన్నీ రాజా


LokSabha Elections: అమేఠీలో నామినేషన్ వేసిన కిషోరీ లాల్ శర్మ

అనంతరం స్థానిక మహిళలు, పార్టీ అభ్యర్థి మొహువా మోయిత్రితో కలిసి సీఎం మమతా బెనర్జీ కలిసి డ్యాన్స్ చేశారు. అందుకు సంబంధించిన వీడియోను టీఎంసీ అభ్యర్థి మొహువా మోయిత్రి తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా తనకు మద్దతుగా ప్రచారం చేసినందుకు మమతాకు ఈ సందర్బంగా మోయిత్రి ధన్యవాదాలు తెలిపారు.


LokSabha Elections: ఎన్నికలకు ముందే ఓటమి ఒప్పుకున్నారు..

గతవారం మాల్డాలోని స్థానిక మహిళలతో కలిసి బెంగాలీ జానపద గీతాలను అనుగుణంగా సీఎం మమతా బెనర్జీ నృత్యం చేశారు. కృష్ణనగర్ లోక్‌సభ స్థానం నుంచి టీఎంసీ అభ్యర్థిగా మొహువా మోయిత్రి బరిలో దిగారు. గత ఎన్నికల్లో సైతం ఆమె ఇదే స్థానం నుంచి గెలుపొందారు. అయితే లోక్‌సభలో మోయిత్రి ప్రశ్నలు అడిగేందుకు బహుమతులు అందుకొందనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యలంలో గతేడాది పార్లమెంట్‌లో ఎథిక్స్ కమిటీ విచారణ జరిపి.. ఆమెను లోక్ సభ నుంచి బహిష్కరించిన సంగతి తెలిసిందే.

Read Latest National News And Telugu News

Updated Date - May 03 , 2024 | 06:28 PM