Share News

LokSabha Elections: మళ్లీ నామినేషన్ వేసిన రాహుల్ గాంధీ.. స్పందించిన అన్నీ రాజా

ABN , Publish Date - May 03 , 2024 | 05:23 PM

కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ రెండో సారి లోక్‌సభ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఈ అంశంపై వాయనాడ్‌ లోక్‌సభ స్థానం నుంచి రాహుల్ గాంధీ ప్రత్యర్థి, సీపీఎం నాయకురాలు అన్నీ రాజా శుక్రవారం స్పందించారు.

LokSabha Elections: మళ్లీ నామినేషన్ వేసిన రాహుల్ గాంధీ.. స్పందించిన అన్నీ రాజా
Annie Raja

న్యూఢిల్లీ, మే 5: కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ రెండో సారి లోక్‌సభ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఈ అంశంపై వాయనాడ్‌ లోక్‌సభ స్థానం నుంచి రాహుల్ గాంధీ ప్రత్యర్థి, సీపీఎం నాయకురాలు అన్నీ రాజా శుక్రవారం స్పందించారు. ఇది అన్యాయమన్నారు. ఈ ఎన్నికల్లో రెండో లోక్‌సభ స్థానంగా రాయ్‌బరేలీని రాహుల్ గాంధీ ఎంచుకుంటున్నారని.. కాంగ్రెస్ పార్టీ వాయనాడ్ ప్రజలకు ముందే స్పష్టం చేసి ఉంటే బావుండేదని అన్నీ రాజా అభిప్రాయపడ్డారు.

LokSabha Elections: అమేఠీలో నామినేషన్ వేసిన కిషోరీ లాల్ శర్మ

కనీసం చివరి నిమిషంలో ఈ విధంగా నిర్ణయం తీసుకోవలసి వచ్చిందని వాయనాడ్ ప్రజలకు ఆ పార్టీ వివరణ ఇచ్చినా బావుండేదన్నారు. అయితే ఈ ఎన్నికల్లో రాహుల్ గాంధీ ఈ రెండు లోక్‌సభ స్థానాల్లో విజయం సాధిస్తే.. ఈ రెండింటికి ఆయన రాజీనామా చేస్తారా? అని అన్నీ రాజా సందేహం వ్యక్తం చేశారు. అయితే ఇది సరైన నిర్ణయం కాదన్నారు. ఇది వారి నైతికతను ప్రశ్నిస్తుందని ఆమె స్పష్టం చేశారు.


కనీసం వాయనాడ్ ఎన్నికల ప్రచారంలో చివర రోజు అయినా.. తాను రాయబరేలీ నుంచి కూడా పోటీ చేసే అవకాశాలున్నాయని.. ఈ నియోజకవర్గ ప్రజలకు రాహుల్ తెలియజేస్తే బావుండేదని అన్నీ రాజా అన్నారు. ఈ రెండు స్థానాల్లో రాహుల్ గెలిస్తే.. ఓ లోక్‌సభ స్థానానికి మాత్రం ఆయన రాజీనామా చేయాల్సి ఉంటుందన్నారు. అయితే రాహుల్ ఏ స్థానానికి రాజీనామా చేస్తారో.. ఆ నియోజకవర్గ ప్రజలకు ఆయన అన్యాయం చేసిన వారవుతారని చెప్పారు.

LokSabha Elections: ఎన్నికలకు ముందే ఓటమి ఒప్పుకున్నారు..

ఆ క్రమంలో రాహుల్ వాయనాడ్‌ స్థానాన్నే వదులుకొనే అవకాశాలున్నాయని స్పష్టం చేశారు. ఇక 2019 ఎన్నికల్లో అమేఠీతోపాటు కేరళలోని వాయనాడ్ లోక్‌సభ స్థానం నుంచి రాహుల్ గాంధీ పోటీ చేశారని.. అయితే అమేఠీలో బీజేపీ అభ్యర్థి స్మృతీ ఇరానీ చేతిలో ఆయన ఓడిపోయారని.. కానీ వాయనాడ్‌లో మాత్రం రాహుల్ విజయం సాధించారని అన్నీ రాజా ఈ సందర్భంగా గుర్తు చేశారు.


మరోవైపు అమేఠీ, రాయ్‌బరేలీ స్థానాల అభ్యర్థుల ఎంపిక విషయంలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం చివరి నిమిషంలో నిర్ణయం తీసుకుంది. నామినేషన్లు దాఖలు చేసేందుకు చివర రోజు మే 3వ తేదీ. ఆ రోజు అమేఠీ నుంచీ కిషోరీ లాల్ శర్మ, రాయ్‌బరేలీ నుంచి రాహుల్ గాంధీలు తమ అభ్యర్థులని ఆ పార్టీ ప్రకటించింది. మరోవైపు దశాబ్దాలుగా రాయ్‌బరేలీ నియోజకవర్గం గాంధీ కుటుంబానికి కంచుకోటగా ఉన్న సంగతి తెలిసిందే.

ABN Effect: ఆంధ్రజ్యోతి దెబ్బకు దిగొచ్చిన ప్రభుత్వం

ఇంకోవైపు ఇదే అంశంపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మాణికం ఠాగూర్ స్పందించారు. ముందు ఎన్నికలైతే జరగనివ్వండి.. ఆ తర్వాత ఈ అంశంపై కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందన్నారు. అదీకాక ఈ ఎన్నికల్లో రాహుల్ గాందీపై వాయనాడ్ ప్రజలు ప్రేమానురాగాలు కురిపించారని చెప్పారు. ఇక వాయనాడ్‌లో రాహుల్ గాంధీ ఓటమి ఖాయమైందని.. అందుకే ఆయన రాయ్‌బరేలీ నుంచి మళ్లీ నామినేషన్ దాఖలు చేశారని బీజేపీ నేత మజిందర్ సింగ్ సిర్సా ఆరోపించారు.

Read Latest National News And Telugu News

Updated Date - May 03 , 2024 | 05:26 PM