Share News

Lok Sabha Elections: మోదీ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారు.. నోరు జారిన నితీష్

ABN , Publish Date - May 26 , 2024 | 07:35 PM

ఎన్నికల ప్రచార ఉధృతితో ఆరితేరిన నేతలు కూడా ఒక్కోసారి తడబడుతుంటారు. జేడీయూ అధినేత, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఆదివారంనాడు పాట్నాలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో సరిగ్గే ఇలాగే తడబడ్డారు. నరేంద్ర మోదీ మళ్లీ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నానని అన్నారు.

Lok Sabha Elections: మోదీ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారు.. నోరు జారిన నితీష్

పాట్నా: ఎన్నికల ప్రచార ఉధృతితో ఆరితేరిన నేతలు కూడా ఒక్కోసారి తడబడుతుంటారు. జేడీయూ అధినేత, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ (Nitish Kumar) ఆదివారంనాడు పాట్నాలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో సరిగ్గే ఇలాగే తడబడ్డారు. నరేంద్ర మోదీ మళ్లీ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నానని అన్నారు. "దేశవ్యాప్తంగా 400కు పైగా సీట్లలో మేము (ఎన్డీయే) గెలవాలని అనుకుంటున్నాము. నరేంద్ర మోదీ మళ్లీ ముఖ్యమంత్రి కావాలి. అప్పుడే భారతదేశం అభివృద్ధి చెందుతుంది, బీహార్ అభివృద్ధి జరుగుతుంది, ప్రతీదీ జరుగుతుంది'' అని నితీష్ అన్నారు.


మోదీ మళ్లీ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నట్టు నితీష్ చేసిన వ్యాఖ్యలను వేదికపై ఉన్న పలువురు గుర్తించడంతో వెంటనే నితీష్ సర్దుకున్నారు. నరేంద్ర మోదీ ప్రధానిగా ఉన్నారని, ఆయన అలాగే ముందుకు సాగాలని తాను కోరుకుంటున్నట్టు చెప్పారు. నితీష్ ఇటీవల కూడా ఎన్నికల ప్రచార సభలో పొరపాటున నోరుజారారు. 2020లో మరణించిన రామ్ విలాస్ పాశ్వాన్‌కు ఓటు వేయాలని కోరారు. ఈ సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ-జేడీయూ-ఎల్జేపీ కూటమిగా ఏర్పడి బీహార్‌లో పోటీ చేస్తున్నాయి.

Updated Date - May 26 , 2024 | 07:35 PM