Share News

Encounter: మావోయిస్టులకు ఊహించని ఎదురుదెబ్బ

ABN , Publish Date - Mar 19 , 2024 | 09:39 AM

National: రాష్ట్రంలో మావోయిస్టులకు ఊహించని రీతిలో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఛత్తీస్‌గఢ్ - మహారాష్ట్ర సరిహద్దుల్లో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో నలుగురు మావోయిస్టు అగ్రనేతలు మృతి చెందారు. చనిపోయిన నలుగురు నక్సల్ కమాండర్లపై రూ.36 లక్షల రివార్డు ఉంది. ఈరోజు (మంగళవారం) ఉదయం ఈ ఎన్‌కౌంటర్ జరిగింది.

Encounter: మావోయిస్టులకు ఊహించని ఎదురుదెబ్బ

ఛత్తీస్‌గఢ్, మార్చి 19: రాష్ట్రంలో మావోయిస్టులకు ఊహించని రీతిలో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఛత్తీస్‌గఢ్ - మహారాష్ట్ర సరిహద్దుల్లో భారీ ఎన్‌కౌంటర్ (Encouter) జరిగింది. ఈ ఘటనలో నలుగురు మావోయిస్టు అగ్రనేతలు మృతి చెందారు. చనిపోయిన నలుగురు నక్సల్ కమాండర్లపై రూ.36 లక్షల రివార్డు ఉంది. ఈరోజు (మంగళవారం) ఉదయం ఈ ఎన్‌కౌంటర్ జరిగింది. సీ60 కమాండోలతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో నలుగురు మావోలు మృత్యువాతపడ్డారు. మృతులు డీవీసీ సభ్యుడు వర్గీష్, డీవీసీ మంగాతు, ప్లాటూన్ సభ్యుడు కురసం రాజు, ప్లాటూన్ సభ్యుడు వెంకటేష్‌గా గుర్తించారు. ఘటనా స్థలంలో ఏకే 47, ఒక కార్బైన్, రెండు పిస్టల్స్‌తో సహా పెద్ద మొత్తంలో పేలుడు పదార్థాలను కమాండోలు స్వాధీనం చేశారు.

Weather Report: తెలుగు రాష్ట్రాల ప్రజలకు బిగ్ అలర్ట్.. భారీ వర్షం కురిసే ఛాన్స్..!


మృతుల్లో ఆదిలాబాద్‌లో మావో నేతలు

మహారాష్ట్ర ఎన్ కౌంటర్ మృతుల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన మావోయిస్టు నేతలు ఉన్నారు. కొమురం భీం - మంచిర్యాల డివిజన్ కమిటి సభ్యునిగా వర్గేష్ కొనసాగుతున్నాడు. గత ఐదేళ్లుగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మావోయిస్టు పార్టీ బలోపేతం కోసం ప్రయత్నాలు చేశారు. పోలీసుల నిర్భంధంతో మహారాష్ట్ర కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. అలాగే మరో మావో నేత మంగ్తు.. సిర్పూర్ -చెన్నూరు ఏరియా కమిటి సభ్యునిగా కొనసాగుతున్నాడు. వీరితో పాటు వెంకటేష్, రాజు.. ప్లాటూన్ సభ్యులుగా ఉన్నారు. వీరి నలుగురిపై రూ.36 లక్షల రివార్డు ఉంది. నిన్ననే ప్రాణహిత నది దాటి తమ రాష్ట్రంలోకి ప్రవేశించినట్టు మహారాష్ట్ర పోలీసులు ప్రకటించారు.

ఇవి కూడా చదవండి..

TG Politics: మల్లారెడ్డి పార్టీ మారడం ఖాయం!

Delhi Liquor Scame: సుప్రీం కోర్టులో కవిత పిటషన్.. నేడు విచారణ..

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Mar 19 , 2024 | 09:43 AM