Share News

Manmohan Singh: మన్మోహన్ అవినీతి వ్యతిరేకి: అన్నా హజారే

ABN , Publish Date - Dec 27 , 2024 | 07:16 PM

మహారాష్ట్రలో తన స్వగ్రామమైన రాలేగావ్ సిద్ధిలో పీటీఐ వార్తా సంస్థతో హజారే మాట్లాడుతూ, పుట్టినవారికి మరణం తప్పదని, అయితే కొన్ని జ్ఞాపకాలు, వారసత్వం మాత్రం మిగిలిపోతాయని అన్నారు.

Manmohan Singh: మన్మోహన్ అవినీతి వ్యతిరేకి: అన్నా హజారే

రాలేగావ్ సిద్ధి: మాజీ ప్రధాని దివంగత మన్మోహన్ సింగ్ (Manmohan Singh) మృతికి ప్రముఖ సామాజిక కార్యకర్త, అవినీతి వ్యతిరేక ఉద్యమ నేత అన్నా హజారే (Anna Hazare) సంతాపం తెలిపారు. ఆయన అవినీతికి వ్యతిరేకి అని, లోక్‌పాల్, ఇతర అవినీతి వ్యతిరేక చర్యలకు వేగంగా చర్యలు తీసుకున్న నేత అని కొనియాడారు. మహారాష్ట్రలో తన స్వగ్రామమైన రాలేగావ్ సిద్ధిలో పీటీఐ వార్తా సంస్థతో హజారే మాట్లాడుతూ, పుట్టినవారికి మరణం తప్పదని, అయితే కొన్ని జ్ఞాపకాలు, వారసత్వం మాత్రం మిగిలిపోతాయని అన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థకు డాక్టర్ మన్మోహన్ సింగ్ కొత్త దిశను చూపించారని, దేశం, సమాజ సంక్షేమానికి సింగ్ ప్రాధాన్యతనిచ్చేవారని అన్నారు.

Manmohan Singh: నా పిల్లలకు ట్యూషన్ ఫీజు ఆఫర్ చేశారు.. మన్మోహన్‌ జ్ఞాపకాన్ని గుర్తుచేసుకున్న మలేషియా ప్రధాని


లోక్‌పాక్ నిరసనలను చేపట్టిన సమయంలో తనను మన్మోహన్ చర్చలకు ఆహ్వానించారని, త్వరితగతిన నిర్ణయాలు తీసుకునేవారని అన్నా హజారే గుర్తు చేసుకున్నారు. "ఆయన అవినీతికి వ్యతిరేకం. లోక్‌పాల్, లోకాయుక్త చట్టాలకు సంబంధించి వెంటనే నిర్ణయాలు తీసుకున్నారు. ఆయన ఎప్పుడు దేశం గురించి, ప్రజలకు ఎంత మెరుగైన సేవలందించాలనే విషయం గురించే ఆయన నిరంతరం ఆలోచించే వారు'' అని హజారే పేర్కొన్నారు. భౌతికంగా మన్మోహన్ ఈలోకాన్ని విడిచిపెట్టినప్పుడు, ప్రజల మనసుల్లో ఎప్పటికీ జ్ఞాపకం ఉంటారని అన్నారు.


ఇవి కూడా చదవండి...

Annamalai: కొరడాతో కొట్టుకుని బీజేపీ అధ్యక్షుడి నిరసన..వీడియో

Bangalore: ఎమ్మెల్యేపై దాడితో.. ఎమ్మెల్సీ సీటీ రవికి భద్రత పెంపు

Read More National News and Latest Telugu News

Updated Date - Dec 27 , 2024 | 07:16 PM