Share News

Delhi: లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం.. రౌస్ అవెన్యూ కోర్టును ఆశ్రయించిన మనీష్ సిసోడియా

ABN , Publish Date - Apr 12 , 2024 | 02:39 PM

దేశ రాజధాని ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి, ఆప్ నేత మనీష్ సిసోడియా మధ్యంతర బెయిల్ కోసం రౌస్ అవెన్యూ కోర్టులో శుక్రవారం పిటిషన్ దాఖలు చేశారు. సీబీఐ, ఈడీ ప్రత్యేక న్యాయమూర్తి కావేరీ బవేజా ఈ పిటిషన్‌ను కాసేపట్లో పిటిషన్‌పై విచారణ చేపట్టే అవకాశం ఉంది.

Delhi: లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం.. రౌస్ అవెన్యూ కోర్టును ఆశ్రయించిన మనీష్ సిసోడియా

ఢిల్లీ: ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి, ఆప్ నేత మనీష్ సిసోడియా(Manish Sisodia) లిక్కర్ స్కాం కేసులో(Delhi Liquor Scam) మధ్యంతర బెయిల్ కోసం రౌస్ అవెన్యూ కోర్టులో శుక్రవారం పిటిషన్ దాఖలు చేశారు. సీబీఐ, ఈడీ ప్రత్యేక న్యాయమూర్తి కావేరీ బవేజా ఈ పిటిషన్‌పై కాసేపట్లో పిటిషన్‌పై విచారణ చేపట్టే అవకాశం ఉంది. రానున్న ఎన్నికల్లో ప్రచారం కోసం తనకు బెయిల్ కావాలని కోరుతూ సిసోదియా కోర్టును ఆశ్రయించినట్లు తెలుస్తోంది.

ఢిల్లీ ఎక్సైజ్ పాలసీని సవరించేటప్పుడు అవకతవకలు జరిగాయని, లైసెన్స్ హోల్డర్‌లకు అనవసరమైన ప్రయోజనాలు కల్పించారని, లైసెన్సు రుసుము తగ్గించారని, కాంపిటెంట్ అథారిటీ అనుమతి లేకుండా లైసెన్సులు పొడిగించారని సీబీఐ, ఈడీ ఆరోపిస్తూ.. ఆయన్ని ఏడాది క్రితం అరెస్టు చేశాయి. ఈ క్రమంలో సిసోదియాను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) ఫిబ్రవరి 26, 2023న అరెస్టు చేసింది.


మార్చి 9, 2023న సీబీఐ ఎఫ్‌ఐఆర్‌లో వచ్చిన మనీలాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) సిసోడియాను మరోమారు అరెస్టు చేసింది. ఫిబ్రవరి 28, 2023న మంత్రి పదవికి సిసోడియా రాజీనామా చేశారు.

Bangalore: ఎన్నికలవేళ కాంగ్రెస్‏కు బిగ్ షాక్‌.. పార్టీకి సీఎం ఆప్తుడు గుడ్‌బై

అంతకుముందు ఫిబ్రవరి 12న ఢిల్లీ కోర్టు ఆయనకు మూడు రోజుల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఫిబ్రవరి 13 నుంచి 15 వరకు లక్నోలో జరిగే తన మేనకోడలు వివాహ కార్యక్రమానికి హాజరయ్యేందుకు అనుమతినిచ్చింది. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో సిసోడియా గతేడాది నుంచి జైలులో ఉన్నారు.

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Apr 12 , 2024 | 02:42 PM