Share News

Mamata Banerjee: రామమందిర ప్రారంభోత్సవం.. బీజేపీపై మమతా బెనర్జీ ఫైర్

ABN , Publish Date - Jan 09 , 2024 | 08:52 PM

ఈనెల 22వ తేదీన అయోధ్యలోని రామమందిరంలో రామ్‌లల్లా ప్రతిష్టాత్మన కార్యక్రమం జరగనున్న తరుణంలో.. కేంద్ర ప్రభుత్వంలోని బీజేపీపై బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. లోక్‌సభ ఎన్నికలకు..

Mamata Banerjee: రామమందిర ప్రారంభోత్సవం.. బీజేపీపై మమతా బెనర్జీ ఫైర్

ఈనెల 22వ తేదీన అయోధ్యలోని రామమందిరంలో రామ్‌లల్లా ప్రతిష్టాత్మన కార్యక్రమం జరగనున్న తరుణంలో.. కేంద్ర ప్రభుత్వంలోని బీజేపీపై బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. లోక్‌సభ ఎన్నికలకు ముందు అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవం ద్వారా బీజేపీ జిమ్మిక్కులకు పాల్పడుతోందని ఆమె ఆరోపించారు. ఈ రామ్‌లల్లా ప్రతిష్టాపన కార్యక్రమాన్ని తన రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవడానికి బీజేపీ ప్రయత్నిస్తోందని వ్యాఖ్యానించారు. ఇతర వర్గాలను మినహాయించే ఉత్సవాలకు తాను మద్దతు ఇవ్వబోనని తేల్చి చెప్పారు.


సౌత్ 24 పరగణాస్ జిల్లాలోని జాయ్‌నగర్‌లో జరిగిన ఒక బహిరంగ కార్యక్రమంలో మమతా బెనర్జీ మాట్లాడుతూ.. మత ప్రాతిపదికన ప్రజలను విభజించడంలో తనకు నమ్మకం లేదని అన్నారు. అన్ని వర్గాల ప్రజలను వెంట తీసుకెళ్లి, ఐక్యత గురించి మాట్లాడే ఉత్సవాలను మాత్రమే తాను నమ్ముతానని చెప్పారు. కోర్టు సూచనల మేరకే.. బీజేపీ ఈ రామమందిర ప్రారంభోత్సవం నిర్వహిస్తోందని, అయితే లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్నాయి కాబట్టి ఈ వేడుకని జిమ్మిక్కుగా చేస్తోందని కుండబద్దలు కొట్టారు. ఎన్నికల ముందు ఈ రామమందిరాన్ని, రాముడ్ని బీజేపీ తన ఎన్నికల ప్రచారం కోసం వాడుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదనే అభిప్రాయాల్ని మమతా బెనర్జీ పరోక్షంగా వ్యక్తపరిచారు.

ఇదిలావుండగా.. జనవరి 22వ తేదీన రామ్‌లల్లా ప్రతిష్టాపన కార్యక్రమాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా జరగనుంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. ఈ వేడుకకు ప్రధాని నరేంద్ర మోదీ సహా 7 వేల మంది ప్రముఖులు హాజరు అవుతున్నారు. వారిలో సినిమా తారలు, క్రీడాకారులతో పాటు ఇతర రంగాలకు చెందిన సెలెబ్రిటీలు కూడా ఉన్నారు. జనవరి 16వ తేదీ నుంచి వైదిక కర్మలు నిర్వహిస్తుండగా.. ఏడు రోజుల పాటు దీనిని కొనసాగించనున్నారు. పూజారి లక్ష్మీ కాంత్ దీక్షిత్ ముడుపుల ప్రధాన ఆచారాలను నిర్వహిస్తుండగా.. ప్రధాని మోదీ ఆలయ విగ్రహ ప్రతిష్టాపనను అలంకరించనున్నారు.

Updated Date - Jan 09 , 2024 | 08:58 PM