Share News

Lok Sabha Polls: లోక్‌సభ ఎన్నికల వేళ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున కీలక నిర్ణయం?

ABN , Publish Date - Mar 12 , 2024 | 11:38 AM

కాంగ్రెస్ (Congress) చీఫ్ మల్లికార్జున్ ఖర్గే (Mallikarjun Kharge) ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో (Lok Sabha Polls 2024) పోటీ చేయకపోవచ్చని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పార్టీ చీఫ్‌గా ఉండి ఎన్నికలకు దూరంగా ఉండకూడదనే సెంటిమెంట్ ఉన్నప్పటికీ.. పార్టీని ముందుండి నడిపించాలని ఆ పార్టీ ముఖ్యలు ఖర్గేకు సలహా ఇచ్చినట్టుగా తెలుస్తోంది. సొంత నియోజకవర్గంలో తన గెలుపుపై దృష్టి పెట్టకుండా దేశవ్యాప్తంగా ఎన్నికలపై ఫోకస్ చేయాలని సలహా ఇచ్చినట్టుగా సమాచారం.

Lok Sabha Polls: లోక్‌సభ ఎన్నికల వేళ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున కీలక నిర్ణయం?

న్యూఢిల్లీ: కాంగ్రెస్ (Congress) చీఫ్ మల్లికార్జున్ ఖర్గే (Mallikarjun Kharge) ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో (Lok Sabha Polls 2024) పోటీ చేయకపోవచ్చని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పార్టీ చీఫ్‌గా ఉండి ఎన్నికలకు దూరంగా ఉండకూడదనే సెంటిమెంట్ ఉన్నప్పటికీ.. పార్టీని ముందుండి నడిపించాలని ఆ పార్టీ ముఖ్యలు ఖర్గేకు సలహా ఇచ్చినట్టుగా తెలుస్తోంది. సొంత నియోజకవర్గంలో తన గెలుపుపై దృష్టి పెట్టకుండా దేశవ్యాప్తంగా ఎన్నికలపై ఫోకస్ చేయాలని సలహా ఇచ్చినట్టుగా సమాచారం. కర్ణాటకలోని గుల్బర్గా నియోజకవర్గం నుంచి మల్లికార్జున ఖర్గేని పోటీకి దింపుతూ ఇటీవలే కాంగ్రెస్ పార్టీ ఏకగ్రీవ నిర్ణయం తీసుకుంది. అయినప్పటికీ ఖర్గే స్థానంలో ఆయన అల్లుడు రాధాకృష్ణన్ దొడ్డమణిని బరిలోకి దించే అవకాశాలున్నాయని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.

కాగా మల్లికార్జున ఖర్గే ‘గుల్బర్గా నియోజకవర్గం’ నుంచి రెండు పర్యాయాలు ఎంపీగా గెలిచారు. అయితే 2019లో ఆయన ఓటమిని చవిచూశారు. అయితే ఆ తర్వాత రాజ్యసభకు నామినేట్ అయ్యారు. రాజ్యసభలో ప్రస్తుతం ప్రతిపక్ష నాయకుడి హోదాలో ఉన్నారు. మరో నాలుగేళ్ల పదవికాలం కూడా మిగిలివుంది. దీంతో అల్లుడిని ప్రత్యక్ష ఎన్నికల్లో నిలిపే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాగా ఖర్గే కొడుకు ప్రియాంక్ ఖర్గే ప్రస్తుతం కర్ణాటక మంత్రిగా ఉన్నారు. అయితే లోక్‌సభ ఎన్నికల్లో పోటీకి ఆయన అనాసక్తిగా ఉన్నారని తెలుస్తోంది. దీంతో రాష్ట్ర మంత్రిలోని వ్యక్తులను లోక్‌సభ ఎన్నికల బరిలో నిలపాలనే యోచనను పార్టీ పక్కన పెట్టింది. కాగా కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రముఖ నేతలు ఎవరూ లోక్‌సభ బరిలో నిలవడం లేదు.

ఇవి కూడా చదవండి

Modi : మోదీ ‘మిషన్‌ సౌత్‌’!

Mission Divyastra : తిరుగులేని ‘దివ్యాస్త్రం’!

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Mar 12 , 2024 | 11:40 AM