Share News

Maliwal Assault Case: బిభవ్ కుమార్‌ను ముంబై తీసుకెళ్తున్న ఢిల్లీ పోలీసులు

ABN , Publish Date - May 21 , 2024 | 02:40 PM

ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్‌‌పై దాడి కేసులో విచారణ కోసం సీఎం అరవింద్ కేజ్రీవాల్ పీఏ బిభవ్ కుమార్‌ ను ఢిల్లీ పోలీసులు ముంబైకి తీసుకు వెళ్తున్నారు. దాడికి సంబంధించిన సాక్ష్యాలను ధ్వంసం చేసేందుకు బిభవ్ ప్రయత్నించినట్టు పోలీసులు అనుమాస్తున్నారు.

Maliwal Assault Case: బిభవ్ కుమార్‌ను ముంబై తీసుకెళ్తున్న ఢిల్లీ పోలీసులు

న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్‌ (Swati Maliwal)పై దాడి కేసులో విచారణ కోసం సీఎం అరవింద్ కేజ్రీవాల్ పీఏ బిభవ్ కుమార్‌ (Bibhav KUmar)ను ఢిల్లీ పోలీసులు ముంబైకి తీసుకు వెళ్తున్నారు. దాడికి సంబంధించిన సాక్ష్యాలను ధ్వంసం చేసేందుకు బిభవ్ ప్రయత్నించినట్టు పోలీసులు అనుమాస్తున్నారు. బిభవ్ కుమార్ తన ఫోన్‌ను ముంబైలో ఫార్మెట్ చేసినట్టు తెలుస్తున్నందున ఆయనను అక్కడకు తీసుకువెళ్తున్నట్టు తీస్ హజారీ కోర్టుకు ఢిల్లీ పోలీసులు తెలియజేశారు. కీలకమైన సాక్ష్యాలను ధ్వంసం చేసేందుకు ఆయన ప్రయత్నించారనే అనేది ఈ కేసులో కీలకంగా తాము భావిస్తున్నట్టు పోలీసులు చెప్పారు.


కుమార్ కస్టడీ వచ్చే గురువారంతో ముగియనుంది. తమ విచారణలో తేలిన అంశాల ఆధారంగా ఆయన రిమాండ్‌ను పొడిగించమని కానీ, సెక్షన్ 201 విధించేందుకు అనుమతించమని కానీ కోర్టును పోలీసులు కోరే అవకాశం ఉంది. నేరానికి సంబంధించిన సాక్ష్యాలను ధ్వంసం చేసే వ్యక్తులను శిక్షించేందుకు సెక్షన్ 201 నమోదు చేస్తారు.

Swati Maliwal: స్వాతి మలివాల్‌పై దాడి కేసును విచారించేందుకు సిట్‌ ఏర్పాటు


'సిట్' ఏర్పాటు

మరోవైపు, స్వాతి మలివాల్‌పై దాడి అంశంపై దర్యాప్తునకు ఢిల్లీ పోలీసులు తాజాగా 'సిట్' (SIT)ని ఏర్పాటు చేశారు. దీనికి నార్త్ ఢిల్లీ అడిషనల్ డిప్యూటరీ కమిషనర్ ఆఫ్ పోలీస్ అంజిత చెప్యాల నేతృత్వం వహిస్తారు. దీనితో పాటు సిట్‌లో ముగ్గురు ఇన్‌స్పెక్టర్ ర్యాంకు అధికారులను చేర్చారు. వీరిలో కేసు నమోదైన సివిల్ లైన్స్ పోలీస్ స్టేషన్‌లోని ఒక అధికారి కూడా ఉన్నారు. ఈనెల 13వ తేదీ ఉదయం మలివాల్‌పై కేజ్రీవాల్ పీఏ విభవ్ కుమార్(Vibhav Kumar) దాడి చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఘటన జరిగిన క్రమాన్ని తెలుసుకోవడానికి ఢిల్లీ పోలీసులు సోమవారం విభవ్ కుమార్‌ను సీఎం నివాసంలోని డ్రాయింగ్ రూమ్‌కు తీసుకెళ్లారు. అన్ని ప్రశ్నలకు సమాధానాలను సీక్వెన్స్‌గా నోట్ చేసుకున్నామని, వాటిని మ్యాప్ చేసి గంటపాటు నేరం జరిగిన ప్రదేశాన్ని ఫొటోలు తీశామని పోలీసు అధికారులు తెలిపారు. కాగా, గత శుక్రవారంనాడు బిభవ్ కుమార్ పోలీసులకు కౌంటర్ కంప్లయింట్ ఇచ్చారు. సీఎం సివిల్ లైన్స్ నివాసంలోకి అనుమతి లేకుండా మలివాల్ ప్రవేశించడంతో పాటు తనను పరుష పదజాలంతో నిందించారని ఆయన ఆరోపించారు.

Read Latest National News and Telugu News

Updated Date - May 21 , 2024 | 02:40 PM