Share News

Mahashivratri 2024: కాశీ, నాసిక్ ఆలయాలకు పోటెత్తిన భక్తులు.. వీడియో

ABN , Publish Date - Mar 08 , 2024 | 07:08 AM

ఈరోజు మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని దేశంలోని అన్ని ఆలయాల్లో తెల్లవారుజాము నుంచి భక్తుల రద్దీ కొనసాగుతుంది. ఈ క్రమంలో కాశీలోని విశ్వనాథ దేవాలయం, నాసిక్ త్రయంబకేశ్వర్ ఆలయాల్లో భక్తులు ఉత్సాహంగా పూజల్లో పాల్గొనగా..ఆ వీడియో వివరాలను ఇక్కడ చుద్దాం.

Mahashivratri 2024: కాశీ, నాసిక్ ఆలయాలకు పోటెత్తిన భక్తులు.. వీడియో

దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది శివ భక్తులకు మహాశివరాత్రి(mahashivratri 2024) రోజు అత్యంత ముఖ్యమైనదని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో నేడు(మార్చి 8న) భక్తులు పెద్ద ఎత్తున వివిధ శివాలయాలను సందర్శిస్తున్నారు. ఈ క్రమంలో దేశంలోని 12 జ్యోతిర్లింగాలలో ఒకటైన నాసిక్‌(Nashik) త్రయంబకేశ్వర్ మహాదేవ్ ఆలయానికి ఈరోజు తెల్లవారుజాము నుంచే భక్తులు(Devotees) భారీగా తరలివస్తున్నారు. ఆలయం వెలుపల క్యూలో నిల్చుని దర్శనం చేసుకునేందుకు వేచి చూస్తున్నారు.

దీంతో ఉదయం నుంచే ఆలయ ప్రాంగణాలు మొత్తం శివనామస్మరణతో మార్మోగుతున్నాయి. మహారాష్ట్రలోని నాసిక్‌లో గోదావరి నది ఒడ్డున త్రయంబకేశ్వర జ్యోతిర్లింగం(Trimbakeshwar temple) స్థాపించబడింది. ఈ ప్రదేశంలో గౌతమ మహర్షి, గోదావరి సమిష్టిగా శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి తపస్సు చేశారనే పురాణం ఉంది. వారి తపస్సు ఫలితంగా ఇక్కడ శివుడు త్రయంబకేశ్వరుని రూపంలో వేలిశాడని చెబుతుంటారు.


మరోవైపు వారణాసిలోని కాశీ(Kashi) విశ్వనాథ దేవాలయానికి(Vishwanath temple) కూడా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. మహాశివరాత్రి సందర్భంగా విశ్వనాథుని దర్శనం కోసం మొత్తం నాలుగు ప్రవేశ ద్వారాలను తెరిచారు. దీంతో ఆయా ద్వారాల నుంచి భక్తులు ఆలయ ప్రవేశం చేసి సులభంగా దర్శనం చేసుకునే విధంగా ఏర్పాట్లు చేశారు.

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: Srisailam: శ్రీశైలంలో వైభవంగా మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు

Updated Date - Mar 08 , 2024 | 07:08 AM