Share News

Students: పదో తరగతి విద్యార్థులకో అలర్ట్.. ఆన్సర్ షీట్ చూపించలేదని ఏకంగా కత్తితో..

ABN , Publish Date - Mar 29 , 2024 | 05:30 PM

దేశంలోని అనేక రాష్ట్రాల్లో ఇప్పటికే పదో తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. పరీక్ష కేంద్రాల వద్ద అధికారులు భద్రతను కట్టుదిట్టం చేశారు. అయితే ఓ చోట ఆన్స్‌ర్ షీట్ చూపించలేదనే కారణంతో విద్యార్థిపై తోటి స్నేహితులు దాడికి దిగారు. సంచలనం సృష్టించిన ఈ ఘటన మహారాష్ట్రలో మార్చి 26న జరిగింది.

Students: పదో తరగతి విద్యార్థులకో అలర్ట్.. ఆన్సర్ షీట్ చూపించలేదని ఏకంగా కత్తితో..

ముంబయి: దేశంలోని అనేక రాష్ట్రాల్లో ఇప్పటికే పదో తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. పరీక్ష కేంద్రాల వద్ద అధికారులు భద్రతను కట్టుదిట్టం చేశారు. అయితే ఓ చోట ఆన్స్‌ర్ షీట్ చూపించలేదనే కారణంతో విద్యార్థిపై తోటి స్నేహితులు దాడికి దిగారు. సంచలనం సృష్టించిన ఈ ఘటన మహారాష్ట్రలో మార్చి 26న జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... థానే జిల్లాలోని భివాండి పట్టణంలో 10వ తరగతి పరీక్షలు జరుగుతున్నాయి.

ఈ క్రమంలో ముగ్గురు విద్యార్థులు తమ స్నేహితుడికి సమాధాన పత్రం చూపించాలని కోరారు. దానికి ఆ విద్యార్థి నిరాకరించాడు. ఇది మనసులో పెట్టుకున్న స్నేహితులు అతడిపై కోపం పెంచుకున్నారు. పరీక్ష అనంతరం అదే రోజు పాఠశాల ఆవరణలో వారికి గొడవ జరిగింది. ఈ క్రమంలో మిగతా ముగ్గురు విద్యార్థులు తమ వెంట తెచ్చుకున్న కత్తితో స్నేహితుడిపై దాడికి పాల్పడ్డారు. ఉపాధ్యాయులు, స్నేహితులు గుర్తించి వారిని ఆపి.. క్షతగాత్రుడిని సమీపంలోని ఓ ఆసుపత్రికి తరలించారు.


"ఎస్‌ఎస్‌సీ పరీక్షల సమయంలో బాధితుడు తన జవాబు పత్రాన్ని నిందితులకు చూపించడానికి నిరాకరించాడు. దీంతో కోపోద్రిక్తతకు గురైన ముగ్గురు పరీక్ష హాల్ నుంచి బయటకు రాగానే అతనిని పట్టుకుని కొట్టారు. అనంతరం కత్తితో పొడిచారు. ఈ ఘటనలో విద్యార్థి గాయపడ్డాడు. అతన్ని హుటాహుటిన ఆసుపత్రిలో చేర్పించాం" అని ఓ పోలీసు అధికారి తెలిపారు.

విద్యార్థిని డిశ్చార్జి చేశామని.. అతని ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముగ్గురు మైనర్‌లపై భివాండిలోని శాంతి నగర్ పోలీస్ స్టేషన్‌లో IPC సెక్షన్ 324 (ప్రమాదకరమైన ఆయుధాలతో గాయపరచడం) కింద కేసు నమోదు చేశారు.

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Mar 29 , 2024 | 05:31 PM