Share News

Lok Sabha polls results: మెజారిటీ మార్క్ దాటిన ఎన్డీయే...గట్టి పోటీనిస్తున్న 'ఇండియా' కూటమి

ABN , Publish Date - Jun 04 , 2024 | 12:39 PM

''400 సీట్లకు పైనే'' అనే నినాదంతో లోక్‌సభ ఎన్నికల బరిలోకి దిగిన బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే మెజారిటీకే పరిమితమయ్యే పరిస్థితి కనిపిస్తోంది. ఎన్నికల కమిషన్ మధ్యాహ్నం 12 గంటల వరకూ వెలువరించిన ట్రెండ్స్ ప్రకారం ఎన్డీయే కూటమి 295 సీట్లలో ఆధిక్యంలో ఉంది.ఎగ్జిట్ ఫలితాలను తలకిందులు చేస్తూ 'ఇండియా' కూటమి 230 సీట్లలో ఆధిక్యంలో ఉంది.

Lok Sabha polls results: మెజారిటీ మార్క్ దాటిన ఎన్డీయే...గట్టి పోటీనిస్తున్న 'ఇండియా' కూటమి

న్యూఢిల్లీ: ''400 సీట్లకు పైనే'' అనే నినాదంతో లోక్‌సభ ఎన్నికల బరిలోకి దిగిన బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే (NDA) మెజారిటీకే పరిమితమయ్యే పరిస్థితి కనిపిస్తోంది. ఎన్నికల కమిషన్ మధ్యాహ్నం 12 గంటల వరకూ వెలువరించిన ట్రెండ్స్ ప్రకారం ఎన్డీయే కూటమి 295 సీట్లలో ఆధిక్యంలో ఉంది. 238 సీట్లలో బీజేపీ లీడింగ్‌ కొనసాగుతోంది. ఎగ్జిట్ ఫలితాలను తలకిందులు చేస్తూ 'ఇండియా' (I.N.D.I.A.) కూటమి 230 సీట్లలో ఆధిక్యంలో ఉంది. ఇండియా కూటమి భాగస్వామ్య పార్టీలైన సమాజ్‌వాదీ పార్టీ 33 సీట్లు, తృణమూల్ కాంగ్రెస్ 29 సీట్లలోనూ ఆధిక్యత సాగిస్తున్నాయి. రాహుల్ గాంధీ రాయబరేలి, వయనాడ్‌ నియోజకవర్గాల్లోనూ, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వారణాసిలోనూ ఆధిక్యంలో ఉన్నారు. 2019 ఎన్నికల్లో బీజేపీ సొంతంగా 303 సీట్లు గెలుచుకోగా, ఎన్డీయే 353 సీట్లు సాధించింది. కాంగ్రెస్ 52 సీట్లు గెలుచుకోవడంతో యూపీఏ 93 సీట్లకే పరిమితమైంది.

Read Latest International News and Telugu News

Updated Date - Jun 04 , 2024 | 12:39 PM