Share News

Lok Sabha Polls: పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులకు ఎన్నికల గుర్తులు ఎలా కేటాయిస్తారో తెలుసా..

ABN , Publish Date - Mar 29 , 2024 | 04:14 PM

లోక్ సభ ఎన్నికలకు ఈసీ(EC) సిద్ధమవుతోంది. దేశవ్యాప్తంగా ఎన్నికల వాతావరణం వచ్చేసింది. అధికార, ప్రతిపక్షపార్టీల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. లోక్ సభ ఎన్నికలు వివిధ దశల్లో ఏప్రిల్ 19 నుంచి జరగనుండగా.. ఎన్నికల యుద్ధంలో గెలవడానికి అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ తదితర పార్టీలు కసరత్తు ముమ్మరం చేశాయి. ఎన్నికల గుర్తులెలా కేటాయిస్తారో తెలుసా..

Lok Sabha Polls: పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులకు ఎన్నికల గుర్తులు ఎలా కేటాయిస్తారో తెలుసా..

ఢిల్లీ: లోక్ సభ ఎన్నికలకు ఈసీ(EC) సిద్ధమవుతోంది. దేశవ్యాప్తంగా ఎన్నికల వాతావరణం వచ్చేసింది. అధికార, ప్రతిపక్షపార్టీల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. లోక్ సభ ఎన్నికలు వివిధ దశల్లో ఏప్రిల్ 19 నుంచి జరగనుండగా.. ఎన్నికల యుద్ధంలో గెలవడానికి అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ తదితర పార్టీలు కసరత్తు ముమ్మరం చేశాయి. అయితే మీకెప్పుడైనా ఈ సందేహం వచ్చిందా. పార్టీలకు, స్వతంత్ర అభ్యర్థులకు ఎన్నికల గుర్తులు ఎలా కేటాయిస్తారోనని. ఈ వార్త చదవండి.. మీకు ఓ క్లారిటీ వస్తుంది.

ఎన్నికల గుర్తులు..

దేశంలో ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించే పని ఎన్నికల కమిషన్‌కి ఉంటుంది. ఎన్నికల ప్రచారంలో రాజకీయ పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులకు ఈసీ.. గుర్తును కేటాయిస్తుంది. ఈ గుర్తే ఈవీఎం మిషన్లలో ఉంటుంది. పార్టీ పేరు గుర్తుపట్టని వారు గుర్తును చూసి ఈజీగా తమకు నచ్చిన పార్టీకి ఓటు వేయవచ్చు.

గుర్తు ఎలా కేటాయిస్తారు..

ఈసీ దగ్గర చాలా ఎన్నికల గుర్తులుంటాయి. రాజకీయ పార్టీలు తమకు ఫలానా సింబల్ కావాలని ఈసీని కోరుతాయి. అప్పటికే ఆ గుర్తుని ఎవరికీ ఇవ్వకపోతే ఈసీ సదరు రాజకీయ పార్టీకి కేటాయిస్తుంది. అయితే బీజేపీకి చెందిన కమలం పువ్వు, కాంగ్రెస్‌కి చేతి గుర్తు ఇతరులకు ఇవ్వకుండా రిజర్వ్ చేసి ఉన్నాయి. వీటిని వేరే పార్టీలకు, అభ్యర్థులకు కేటాయించడానికి వీల్లేదు. ఇవి కాకుండా ఈసీ దగ్గరున్న ఫ్రీ సింబల్స్‌ని ఈసీ పార్టీకి లేదా అభ్యర్థికి కేటాయిస్తుంది.


పార్టీ గుర్తు రావడం అంటే..

ఒక రాజకీయ పార్టీ తమ నేతల్లో ఎవరినైనా ఎన్నికలలో నిలబెట్టినప్పుడు ఆయన తన పార్టీ ఎన్నికల సంఘం నుంచి అందుకున్న అదే గుర్తుపై ఎన్నికలలో పోటీ చేస్తాడు. పార్టీ జాతీయ అధ్యక్షుడు తమ అభ్యర్థుల పేర్లను రాష్ట్ర అధ్యక్షుడికి ఇస్తారు. దీనిని ఫారం-ఏ అంటారు. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు నామినేషన్ దాఖలు చేయడానికి అభ్యర్థులకు బీ ఫారాన్ని ఇస్తారు.

నిబంధనలేంటి..

భారత రాజ్యాంగంలోని పార్ట్ 15లో ఆర్టికల్ 324 నుంచి ఆర్టికల్ 329 వరకు ఎన్నికల ప్రస్తావన ఉంటుంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 324 ఎన్నికల కమిషన్‌కు ఎలక్షన్ నిర్వహించే బాధ్యతను ఇస్తుంది. ఎన్నికల సంఘం రాజకీయ పార్టీలను నమోదు చేస్తుంది. వారి పనితీరు ఆధారంగా జాతీయ లేదా రాష్ట్ర పార్టీలుగా గుర్తిస్తుంది. ఆ తర్వాత జాతీయ పార్టీకి, ప్రాంతీయ పార్టీకి ఒక్కో గుర్తును కేటాయిస్తారు.

ఎప్పుడు ప్రారంభించారంటే..

దేశానికి స్వాతంత్ర్యం రాకముందే కాంగ్రెస్, ముస్లిం లీగ్ వంటి రాజకీయ పార్టీలకు చిహ్నాలు ఉండేవి. అయితే 1951-52 మధ్య జరిగిన మొదటి సార్వత్రిక ఎన్నికల సమయంలో గుర్తులు ఇవ్వడం ప్రారంభమైంది. ఆ సమయంలో దేశంలో అక్షరాస్యత శాతం చాలా తక్కువగా ఉంది. ఎన్నికల్లో ప్రజల భాగస్వామ్యం పెంచాలనే లక్ష్యంతో పార్టీలకు, అభ్యర్థులకు గుర్తుల పంపిణీకి శ్రీకారం చుట్టారు.

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Mar 29 , 2024 | 04:14 PM