Share News

Ayodhya Ram Temple: ఖైదీలకు మహత్తర అవకాశం.. అయోధ్య ఈవెంట్ ప్రత్యక్ష ప్రసారం

ABN , Publish Date - Jan 06 , 2024 | 09:31 PM

అయోధ్యలోని రామందిరంలో రామ్‌లల్లా ప్రతిష్ఠాపన కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారానికి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం విస్తృత సన్నాహాలు చేస్తోంది. జైళ్లలోని ఖైదీలకు కూడా ఈ కార్యక్రమాన్ని వీక్షించే అవకాశం కల్పించనుంది. ఇందుకు సంబంధించి జైళ్ల శాఖ ఉన్నాతాధికారులతో ఆలయ నిర్మాణ కమిటీ చర్చలు జరిపింది.

Ayodhya Ram Temple: ఖైదీలకు మహత్తర అవకాశం.. అయోధ్య ఈవెంట్ ప్రత్యక్ష ప్రసారం

అయోధ్య: అయోధ్యలోని రామందిరంలో (Ayodhya Ram Temple) రామ్‌లల్లా ప్రతిష్ఠాపన కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారానికి (Live streaming) ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం విస్తృత సన్నాహాలు చేస్తోంది. జైళ్లలోని ఖైదీలకు కూడా ఈ కార్యక్రమాన్ని వీక్షించే అవకాశం కల్పించనుంది. ఇందుకు సంబంధించి జైళ్ల శాఖ ఉన్నాతాధికారులతో ఆలయ నిర్మాణ కమిటీ చర్చలు జరిపింది. రామాలయం ఈవెంట్‌ను ప్రపంచ స్థాయి వేడుకగా నిర్వహిస్తున్నందున ఈ కార్యక్రమాన్ని ఖైదీలు సైతం చూడాల్సిన అవసరం ఉందని యూపీ జైళ్ల శాఖ మంత్రి ధర్మవీర్ ప్రజాపతి తెలిపారు.


''యూపీ జైళ్లలో ప్రస్తుతం 1.05 లక్షల మందికి పైగా ఖైదీలు ఉన్నారు. వాళ్లు కూడా ఈ దేశ పౌరులే. జైళ్లలో ఉన్న కారణంగా వారికి ఈవెంట్‌ను దూరంగా చేయకూడదు. లైవ్ స్ట్రీమింగ్ ద్వారా వారికి సైతం వీక్షించే అవకాశం కల్పిస్తున్నాం'' అని ప్రజాపతి తెలిపారు. జైళ్లలో ఉన్నవారంతా ప్రొఫెషనల్ క్రిమినల్స్ కాదన్నారు. చిన్న చిన్న ఘటనలతోనే కొందరు క్రిమినల్స్‌గా మారుతారని చెప్పారు. కాగా, 22వ తేదీన శ్రీరాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించడంతో పాటు పలు సామాజిక కార్యక్రమాలను కూడా బీజేపీ కార్యకర్తలు చేపడుతున్నారు. దుప్పట్ల పంపిణీ, పండ్లు, ఆహార పొట్లాల పంపిణీ వంటివి పెద్దఎత్తున చేపట్టనున్నారు. రామ్‌లల్లా విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమాలు ప్రధాన వేడుకకు వారం రోజులకు ముందే జనవరి 16న నుంచి ప్రారంభిస్తున్నారు.

Updated Date - Jan 06 , 2024 | 09:31 PM